Share News

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:25 PM

ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ఏడీసీఎల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్
Amaravati Riverfront Tourism

అమరావతి, జులై 17: ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులతో మంత్రి నారాయణ ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. అమ్యూజ్‌మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పీపీపీ విధానంలో ఏడీసీఎల్ అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


సీఎం చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే టూరిజం ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించిన మిగిలిన సంస్థలు కూడా త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ సమీక్షకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు

బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 03:41 PM