Share News

పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 17 , 2026 | 02:49 PM

పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధమిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలని ఆకాంక్షించారు.

పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu

పల్నాడు, జులై 17: పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధమిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(శుక్రవారం) నరసరావుపేటలో క్రెడిట్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రుణపత్రాలను అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలని ఆకాంక్షించారు. 15 వేల మంది డ్వాక్రా మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించామన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి రుణాలు అందజేసినట్లు వెల్లడించారు.


రైతులు, విద్యార్థులు..అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమన్నారు. బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములని చెప్పుకొచ్చారు. రైతు భవిష్యత్తును మార్చడానికి ఈ రుణాలు ఉపయోగకరమన్నారు. వికసిత్‌ భారత్‌ 2024కు అనుగుణంగా సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ విప్లవం తీసుకొచ్చారన్నారు. జనధన్‌ యోజన ద్వారా కోట్లాదిమందికి బ్యాంకు ఖాతాలిచ్చారని చెప్పారు. జీఎస్టీ శ్లాబ్‌లు ఎక్కవ ఉండేవని.. చాలామంది నష్టపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..

మోదీ ఆశీస్సులు, నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ: పయ్యావుల కేశవ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 02:58 PM