Share News

తక్కువ నాణ్యత పొగాకుకూ గిట్టుబాటు ధర.. టొబాకో బోర్డుకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:03 PM

ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు(శుక్రవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించారు.

తక్కువ నాణ్యత పొగాకుకూ గిట్టుబాటు ధర.. టొబాకో బోర్డుకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు
Minister Atchannaidu

అమరావతి, జులై 17: ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు(శుక్రవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించారు. 2026-27లో FCV పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని... రోజుకు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతోందన్నారు.


ప్రస్తుతం గరిష్ఠ ధర రూ.250గా ఉందని.. ధర మరింత పెరిగేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని టొబాకో బోర్డుకు మంత్రి సూచించారు. కొనుగోళ్లు వేగవంతం కావడంతో రైతులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ నాణ్యత గల పొగాకుకూ గిట్టుబాటు ధర లభించేలా కంపెనీలతో చర్చించాలని టొబాకో బోర్డు చైర్మన్, ఈడీకి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు

సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన.. హెలిప్యాడ్, సభా వేదికలు ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 01:08 PM