Share News

సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన.. హెలిప్యాడ్, సభా వేదికలు ఖరారు

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:25 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేదికలను అధికారులు ఖరారు చేశారు.

 సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన.. హెలిప్యాడ్, సభా వేదికలు ఖరారు
CM Chandrababu

కృష్ణా జిల్లా, జులై 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(శనివారం) గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుడివాడలో వేదికలను అధికారులు ఖరారు చేశారు. ఈరోజు(శుక్రవారం) బైపాస్ రోడ్డు, ఇంజినీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలలో సీఎంఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లను ఖరారు చేశారు. కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏర్పాట్లను పరిశీలించారు. బైపాస్ రోడ్డులో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశ వేదికను సిద్ధం చేయనున్నారు.


గౌతమ్ పాఠశాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగంతో కలెక్టర్ బాలాజీ సమావేశమయ్యారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచనలు చేశారు. సీఎం పర్యటనకు గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.


ఇవి కూడా చదవండి...

క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి

కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 12:31 PM