కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:52 AM
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్-మల్కాజిగిరి, జులై 17: జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు రాములు (60), రషీద్ (40)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే కీసర పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతులిద్దరూ మెదక్ జిల్లా వాసులుగా తెలుస్తోంది.
ట్రాలీ ఆటోను ఢీకొట్టిన అనంతరం గుర్తుతెలియని వాహన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News