కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:25 AM
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
న్యూఢిల్లీ, జులై 17: కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ(CEC) సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతలకు అడ్డుతగులుతున్నారని కమిటీకి అటవీ శాఖ తెలిపింది. అటవీ శాఖ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని.. తక్షణమే రంగంలోకి దిగాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులో తాజా ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సీఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆటపాక బర్డ్ సెంటర్ ఎండిపోవడం, పక్షుల మనుగడ ప్రమాదంలో పడటంపై పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ వేస్ట్, పురుగుమందుల వ్యర్థాలతో కొల్లేరు సరస్సు కలుషితం కావడంపై సమగ్ర సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. ఆటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడం, కొల్లేరు కాలుష్యంపై కమిటీ సీరియస్ అయ్యింది. కూల్చివేతల పురోగతి, కాలుష్య నివారణ చర్యలపై త్వరలోనే నివేదిక సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌కు సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
Read Latest AP News And Telugu News