ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య.. ప్రాణాలతో బయటపడ్డ కుమారుడు
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:18 AM
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి, జులై 17: జిల్లాలోని శంకర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతానికి చెందిన వసంత, సుధాకర్ దంపతులు.. ఉపాధి కోసం వచ్చి శంకర్‌పల్లి సమీపంలో కొత్తపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. వీరికి పదిహేనేళ్ల కూతురు, పదేళ్ల కుమారుడు ఉన్నారు. నిన్న(గురువారం) రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
దీంతో మనస్తాపం చెందిన వసంత.. తన కూతురు నవ్య, కుమారుడిని బావిలోకి తోసి ఆపై ఆమె కూడా దూకేసింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతిచెందగా.. పదేళ్ల కుమారుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే శంకర్‌పల్లి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరింత సమాచారం కోసం పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
దారుణం: కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
Read Latest Telangana News And Telugu News