గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:20 PM
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదోన్నతుల కల్పనకు సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జులై 17: గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదోన్నతుల కల్పనకు సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ ప్రభుత్వం ఈరోజు(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సర్వీస్ రూల్స్ సడలించాలని గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. 2008 నుంచి ఈ అంశంపై వార్డెన్లు సర్కార్‌కు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు ఉపశమనం లభించినట్లైంది. ఈ సందర్భంగా తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సవితకు గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వార్డెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన.. హెలిప్యాడ్, సభా వేదికలు ఖరారు
తక్కువ నాణ్యత పొగాకుకూ గిట్టుబాటు ధర.. టొబాకో బోర్డుకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు
Read Latest AP News And Telugu News