Share News

మహిళల హాకీ ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:34 PM

ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సలీమా టెటే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.

మహిళల హాకీ ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన
India Women's Hockey Team

ఇంటర్నెట్ డెస్క్: ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సలీమా టెటే కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రధాన కోచ్ స్జోర్డ్ మారైన్ ఎంపిక చేశారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచ కప్‌కు ముందు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరంలో భారత జట్టు కసరత్తులు చేస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌లో ఓటమి లేకుండా టైటిల్ గెలిచిన ఆటగాళ్లకు ఈ జట్టులో ప్రాధాన్యం లభించింది.


పూల్- డి‌లో భారత్

ప్రపంచ కప్‌లో భారత్ పూల్-డి లో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో ఉన్న వాగెనర్ హాకీ స్టేడియంలో భారత్ తన లీగ్ మ్యాచ్‌లన్నింటినీ ఆడనుంది. ఆగస్టు 16న చైనా, ఆగస్టు 18న దక్షిణాఫ్రికా, ఆగస్టు 20న ఇంగ్లండ్‌ జట్లతో భారత్ తలపడనుంది.


హాకీ ప్రపంచ కప్‌నకు భారత జట్టు ఇదే

గోల్‌కీపర్లు: సవిత, బిచు దేవి ఖరిబామ్

డిఫెండర్లు: ఇషికా చౌదరి, సుశీలా చాను, లాల్తంత్లువాంగి, జ్యోతి, శిల్పి దబాస్

మిడ్‌ఫీల్డర్లు: సలీమా టెటే (కెప్టెన్), నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునెలితా టొప్పో, నేహా, దీపికా సోరెంగ్

ఫార్వర్డ్స్: లాల్‌రెమ్సియామి, రుతుజా దాదాసో పిసాల్, నవ్‌నీత్ కౌర్, దీపిక, ఇషికా, బల్జీత్ కౌర్, బ్యూటీ దుంగ్‌దుంగ్


ఇవి కూడా చదవండి:

ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్

Updated Date - Jul 17 , 2026 | 04:34 PM