Share News

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్

ABN , Publish Date - Jul 17 , 2026 | 02:59 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిపై ప్రముఖ సింగర్ షకీరా ప్రశంసల జల్లు కురిపించారు.

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్
Shakira

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిపై ప్రముఖ సింగర్ షకీరా ప్రశంసల జల్లు కురిపించారు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు మెస్సికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు మెస్సి భార్య ఆంటోనెలా కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాటికి సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.


‘లియోనెల్ మెస్సి అసాధారణ ఆటగాడు. అతడి క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. వయసు, వచ్చే విమర్శలు ఒక వ్యక్తి సామర్థ్యాన్ని నిర్ణయించలేవని మెస్సి నిరూపిస్తున్నాడు. మెస్సి విజయాల్లో అతడి భార్య ఆంటోనెలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆంటోనెలా లాంటి జీవిత భాగస్వామి పక్కన ఉండటం మెస్సికి మరింత బలం’ అని షకీరా పేర్కొన్నారు. షకీరా చేసిన పోస్టును మెస్సి భార్య ఆంటోనెలా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీషేర్ చేశారు. అయితే మెస్సి, ఆంటోనెలా చిన్ననాటి స్నేహితులు కాగా.. 2017లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు.. ఎలాంటి పోటీ లేకుండానే..

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Jul 17 , 2026 | 02:59 PM