రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:08 AM
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు. రోహిత్ శర్మపై మేనేజ్‌మెంట్ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని తెలిపారు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ నిరాశపర్చడంతో అతడి భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లోనూ రోహిత్‌కు స్థానం లేదని, యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని భారత సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రోహిత్‌పై రిటైర్‌మెంట్ ఒత్తిడి పెరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అతడు కూడా ఒత్తిడిగా ఫీలయ్యే ఆటగాడు కాదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోయినా అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పరుగులు చేయలేకపోవచ్చు. కానీ అతడిలో భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉంది. అలాంటి విషయాలు ఆటలో సహజమే. క్రికెట్‌లో ఎన్నో సార్లు స్టార్ బ్యాటర్లు కూడా లయ అందుకోలేని సందర్భాలు ఉంటాయి. అందుకే రెండు మ్యాచ్‌ల ఆధారంగా ఇలాంటి నిర్ణయానికి రావడం సరైంది కాదు. లార్డ్స్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రోహిత్ నుంచి పూర్తి భిన్నమైన ఇన్నింగ్స్ చూస్తాం. ఇంగ్లండ్ వంటి పిచ్‌పై రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని నేను చెప్పను. పిచ్‌పై డబుల్ బౌన్స్ కారణంగా అతడు సాధారణంగా ఆడే కొన్ని షాట్లు ఆడటానికి అంతగా సౌకర్యంగా అనిపించకపోయి ఉండొచ్చు. మరోవైపు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వేగంగా ఆడుతున్నారు. రోహిత్‌కు తనకు నచ్చిన లెంగ్త్‌లో కూడా బంతులు రాలేదు. అంతే తప్ప రెండు మ్యాచ్‌ల ఆధారంగా అతడు ఫామ్ కోల్పోయాడని చెప్పడం సరికాదు’ అని కోటక్ అన్నారు.
ఇవీ చదవండి: