Share News

వరల్డ్‌ నెం.5కి సింధు షాక్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:11 AM

పీవీ సింధు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హాన్‌ ఈకి షాకిచ్చి జపాన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి...

వరల్డ్‌ నెం.5కి సింధు షాక్‌

జపాన్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరిక

టోక్యో: పీవీ సింధు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హాన్‌ ఈకి షాకిచ్చి జపాన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ లో వరల్డ్‌ నెం.10 సింధు 21-16, 21-14తో చైనాకు చెందిన హాన్‌పై విజయం సాధించింది. తదుపరి రౌండ్‌లో తన చిరకాల ప్రత్యర్థి నజోమి ఒకుహారా (జపాన్‌)తో 31 ఏళ్ల సింధు అమీతుమీ తేల్చుకోనుం ది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీష/ధ్రువ్‌ కపిల ద్వయం 20-22, 17-21తో టాప్‌ సీడ్‌ ఫెంగ్‌/హువాంగ్‌ డాంగ్‌ (చైనా) జంట చేతిలో రెండో రౌండ్‌లో పోరాడి ఓడింది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 04:11 AM