Share News

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:53 PM

శవపేటికలో ట్రంప్ ఉన్నట్టున్న చిత్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఓ హోర్డింగ్‌పై ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్టున్న చిత్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఓ హోర్డింగ్‌పై ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ను అంతం చేస్తామన్న హెచ్చరికను ఇంగ్లిష్, పర్షియన్ భాషల్లో చిత్రంపై రాశారు. ఎంఘిలాబ్ స్క్వేర్ ప్రాంతంలోని ఓ హోర్డింగ్‌పై ఈ వార్నింగ్‌ను ప్రదర్శించారు. మినాబ్‌కు చెందిన చిన్నారుల స్మృత్యర్థం అని కూడా చిత్రంపై రాశారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన తొలి దాడిలో మినాబ్ నగరంలోగల ఓ స్కూల్లోని విద్యార్థులు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఉద్దేశిస్తూ బిల్‌బోర్డుపై నిరసనకారులు ఈ హెచ్చరిక చేశారు.


గతంలోనే ఇజ్రాయెల్ హెచ్చరికలు..

ట్రంప్‌‌ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ కొద్ది రోజుల క్రితమే యూఎస్‌ను హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాను ఈ మేరకు అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్‌నకు ముప్పు ఉండవచ్చనే సంకేతాలు అమెరికా నిఘా వర్గాల దృష్టికి కూడా వచ్చినట్టు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ట్రంప్‌ను అంతం చేసేందుకు ప్రత్యేకంగా కుట్ర జరుగుతోందని ఇజ్రాయెల్ హెచ్చరించడం ఇదే తొలిసారని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు వైరల్ అయిన కొద్ది సేపటికే ట్రంప్ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ వైపు 1000 మిసైల్స్‌ను గురిపెట్టి ఉంచామని అన్నారు. తనను టార్గెట్ చేస్తే మరిన్ని మిసైల్స్ ఇరాన్ వైపు దూసుకొస్తాయని హెచ్చరించారు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్ టోల్ ఫీజు.. ట్రంప్ మనసు మార్చిన గల్ఫ్ దేశాలు!

బంగ్లాదేశ్ అమ్మాయిల వెంట పడొద్దు.. చైనా రాయబార కార్యాలయం హెచ్చరిక..

Updated Date - Jul 16 , 2026 | 05:15 PM