Share News

బంగ్లాదేశ్ అమ్మాయిల వెంట పడొద్దు.. చైనా రాయబార కార్యాలయం హెచ్చరిక..

ABN , Publish Date - Jul 16 , 2026 | 08:40 AM

బంగ్లాదేశ్‌లో వధువులను కొనుగోలు చేయడం, మానవ అక్రమ రవాణాకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. ఈ తరహా నేరాలకు పాల్పడితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది.

బంగ్లాదేశ్ అమ్మాయిల వెంట పడొద్దు.. చైనా రాయబార కార్యాలయం హెచ్చరిక..
China Bangladesh bride trafficking

బంగ్లాదేశ్‌లో వధువులను కొనుగోలు చేయడం, మానవ అక్రమ రవాణాకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. ఈ తరహా నేరాలకు పాల్పడితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం అత్యవసర సూచన విడుదల చేసింది (China Bangladesh bride trafficking).


ప్రస్తుతం చైనాలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2020 జనాభా లెక్కల ప్రకారం, చైనాలో వివాహ వయస్సులో ఉన్న మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్య దాదాపు 2 కోట్లు ఎక్కువగా ఉంది. అమ్మాయిల కొరతను ఆసరాగా తీసుకుని, అక్రమ రవాణాదారులు వివాహం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పేద దేశాలకు చెందిన యువతులను, ముఖ్యంగా బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు (China embassy warning).


ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. విదేశాల్లో వివాహం పేరుతో జరిగే మోసాలు, మానవ అక్రమ రవాణా ముఠాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తుల మాటలను నమ్మి అక్రమ వివాహాలు చేసుకోవద్దని హెచ్చరించింది. ఇలాంటి చర్యలు స్థానిక చట్టాల ఉల్లంఘనకు దారితీస్తాయని పేర్కొంది.


బ్రోకర్లు కుదిర్చే ఈ వివాహాల వల్ల స్త్రీపురుషులు ఇద్దరూ బాధితులుగా మారుతున్నారు. చైనా పురుషులు భార్యను వెతుక్కోవడానికి వేల యువాన్‌లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఆ విదేశీ వధువులు డబ్బులు తీసుకుని రహస్యంగా అదృశ్యమవుతున్నారు. మరికొన్ని కేసులలో, పేద దేశాలకు చెందిన మహిళలను అపహరించి, చైనా పురుషులను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు (Bride buying).


ఈ నేపథ్యంలో మానవ అక్రమ రవాణా, వధువుల కొనుగోలు, నకిలీ వివాహాలకు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని చైనా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులను లేదా చైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. విదేశాల్లో చట్టాలను ఉల్లంఘించడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు జీవితానికే ముప్పు ఏర్పడే అవకాశముందని కూడా హెచ్చరించింది.


ఇవి కూాడా చదవండి..

ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 16 , 2026 | 08:48 AM