Share News

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Jul 15 , 2026 | 02:53 PM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Minister Lokesh

కడప, జులై 15: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపింది జగనే అని ఆరోజు పాదయాత్రలో చెప్పానని... ఈరోజు కూడా చెబుతున్నానన్నారు. జగన్‌ పార్టీ.. హిట్ అండ్ రన్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. ‘మాజీమంత్రి కొడుకు రోడ్డు ప్రమాదం చేసి ఒకరిని చంపితే తప్పుకాదా? కొడుకు తప్పు చేస్తే ఒక కేంద్రమంత్రి వెంటనే సరెండర్ చేశారు. మీ మాజీమంత్రి తప్పు చేస్తే.. మీరేం చేశారు? గతంలో జగన్ కారు టైర్ల కింద నలిగి ఒకరు చనిపోయారు. ఇవన్నీ వీళ్లకు చిన్న విషయాలులానే ఉంటాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బ్రాహ్మణీ స్టీల్స్‌కు అప్పట్లో ఎకరాకు రూ.19 వేల చొప్పున 11 వేల ఎకరాలు కేటాయించారని మంత్రి తెలిపారు. బ్రాహ్మణీ వల్ల లబ్ధి పొందింది.. గాలి జనార్దన్ రెడ్డి, జగన్ రెడ్డిలు మాత్రమే అని అన్నారు. లీగల్ ప్రాసెస్ చూసుకొని ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ హయాంలో 250 మంది మత్స్యకారులు చనిపోతే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో బాధిత మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.10 లక్షల పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. జగన్ హయంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని.. కూటమి ప్రభుత్వ హయాంలో 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. మళ్లీ నోటిఫికేషన్‌లు ఇస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 03:27 PM