గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు.. ఐదుగురికి గాయాలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 02:35 PM
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.
మెదక్, జులై 15: జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ప్రమాద తీవ్రతకు గదిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారు రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్‌గా గుర్తించారు.
నిన్న(మంగళవారం) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయితే వంట చేస్తుండగా గ్యాస్ పేలిందంటూ నమ్మించేందుకు అక్కడి వారు ప్రయత్నించారు. ఈరోజు ఉదయం పోలీసులు వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. గ్యాస్ అక్రమ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది కాలంగా స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్రమంగా గ్యాస్‌ను ఫిల్లింగ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు
ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News