Share News

ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:57 AM

చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో సారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది.

ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..
Argentina in Final

చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో సారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకున్న అర్జెంటీనా.. ఇంగ్లండ్‌పై 2-1తో విజయాన్ని సాధించింది. జులై 19న జరగబోయే మెగా ఫైనల్‌లో స్పెయిన్‌తో తలపడనుంది (Argentina vs England).


మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు దూకుడుగా ఆడినా తొలి అర్ధభాగంలో గోల్ నమోదు కాలేదు. మ్యాచ్ 55వ నిమిషంలో ఆంథోనీ గోర్డన్ ఒక గోల్ సాధించడంతో ఇంగ్లండ్‌కు ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ రక్షణ పటిష్ఠంగా కనిపించడంతో ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుందనే భావన నెలకొంది. అయితే చివరి నిమిషాల్లో అర్జెంటీనా తన ఆటను పూర్తిగా మార్చేసింది. 85వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్ సాధించి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది (FIFA World Cup 2026).


ఇక, ఆ తర్వాత అదనపు సమయంలో లియోనెల్ మెస్సి ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను లౌటారో మార్టినెజ్ హెడ్డర్‌తో గోల్‌గా మలిచి అర్జెంటీనాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనాల్ మెస్సి (Lionel Messi) తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆడాడు. కీలక సమయంలో మెస్సి అందించిన అసిస్ట్‌ అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో మొత్తం 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో కూడా ముందున్నాడు.


జులై 19వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది (Argentina in Final). ఆ మ్యాచ్‌లో కూడా సత్తా చాటి వరుసగా రెండో టైటిల్ సాధించాలని అర్జెంటీనా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు టోర్నీ ఆసాంతం జోరు కనబరిచిన స్పెయిన్ కూడా టైటిల్‌పై కన్నేసింది. ఈ పోరు కోసం ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Updated Date - Jul 16 , 2026 | 07:06 AM