Share News

గెలిచి..నిలిచిన ఇంగ్లండ్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:14 AM

మూడు వన్డేల సిరీ్‌సలో ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది. వెటరన్‌ జో రూట్‌ (99 నాటౌట్‌) తన అద్భుత ఫామ్‌ను...

గెలిచి..నిలిచిన ఇంగ్లండ్‌

  • రూట్‌ 99 నాటౌట్‌

  • 4 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి

  • శ్రేయాస్‌, విరాట్‌ అర్ధసెంచరీలు వృధా

కార్డిఫ్‌: మూడు వన్డేల సిరీ్‌సలో ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది. వెటరన్‌ జో రూట్‌ (99 నాటౌట్‌) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీ ముంగిట నిలిచాడు. దీంతో గురువారం భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడా తో నెగ్గిన ఇంగ్లండ్‌ ఈ సిరీ్‌సలోనూ 1-1తో సమంగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్‌ (66), విరాట్‌ (65), గిల్‌ (31) రాణించారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 రన్స్‌ చేసి గెలిచింది. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును రూట్‌ ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు జాక్‌ (30)తో కలిసి 72 రన్స్‌ జోడించాడు. కర్రాన్‌ (26), అట్కిన్సన్‌ (23 నాటౌట్‌) సహకరించారు. బ్రార్‌కు 2 వికె ట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రూట్‌ నిలిచాడు.

మిడిలార్డర్‌ తడబాటు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో శ్రేయాస్‌, విరాట్‌ హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కానీ మిడిలార్డర్‌ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు గిల్‌, రోహిత్‌ (26) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్‌-విరాట్‌ జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. బంతికో పరుగు చొప్పున వీరు రెండో వికెట్‌కు 60 పరుగులు జతచేశారు. జాక్స్‌ 18వ ఓవర్‌లో రోహిత్‌ను అవుట్‌ చేయగా, ఇషాన్‌ (1) విఫలమయ్యాడు. విరాట్‌-శ్రేయాస్‌ మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగారు. అయితే 32వ ఓవర్‌లో విరాట్‌ను ఆర్చర్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో బుమ్రా 43వ ఓవర్‌లో 4,4,4,6తో 18 రన్స్‌ రాబట్టి కాస్త జోష్‌ నింపాడు. అట్కిన్సన్‌ 44వ ఓవర్‌లో చివరి రెండు వికెట్లు తీయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు: భారత్‌: రోహిత్‌ (సి) బట్లర్‌ (బి) జాక్స్‌ 26, గిల్‌ (సి) డకెట్‌ (బి) అట్కిన్సన్‌ 31, విరాట్‌ (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 65, ఇషాన్‌ (సి అండ్‌ బి) కర్రాన్‌ 1, శ్రేయాస్‌ (సి) బట్లర్‌ (బి) అట్కిన్సన్‌ 66, సుందర్‌ (సి) బట్లర్‌ (బి) సకీబ్‌ 2, అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1, దూబే (సి అండ్‌ బి) ఆర్చర్‌ 0, బ్రార్‌ (సి) అట్కిన్సన్‌ (బి) సకీబ్‌ 7, బుమ్రా (నాటౌట్‌) 20, ప్రసిద్ధ్‌ (బి) అట్కిన్సన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 44 ఓవర్లలో 233 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-44, 2-104, 3-111, 4-178, 5-181, 6-193, 7-193, 8-210, 9-233, 10-233; బౌలింగ్‌: ఆర్చర్‌ 10-0-47-3, సకీబ్‌ 9-1-52-2, అట్కిన్సన్‌ 9-1-50-3, రషీద్‌ 5-0-34-0, కర్రాన్‌ 6-1-23-1, జాక్స్‌ 5-0-21-1.

ఇంగ్లండ్‌: డకెట్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 0, బెథెల్‌ (సి) ఇషాన్‌ (బి) ప్రసిద్ధ్‌ 4, రూట్‌ (నాటౌట్‌) 99, బ్రూక్‌ (సి) ఇషాన్‌ (బి) బ్రార్‌ 16, కర్రాన్‌ (సి) ఇషాన్‌ (బి) దూబే 26, బట్లర్‌ (బి) అక్షర్‌ 17, జాక్స్‌ (సి) కోహ్లీ (బి) బ్రార్‌ 30, అట్కిన్సన్‌ (నాటౌట్‌) 23 ; ఎక్స్‌ట్రాలు : 20 ; మొత్తం 44.1 ఓవర్లలో 235/6 ; వికెట్లపతనం : 1-0, 2-8, 3-53, 4-94, 5-125, 6-197 ; బౌలింగ్‌: బుమ్రా 10-0-45-1, ప్రసిద్ధ్‌ 9.1-1-52-1, బ్రార్‌ 10-0-67-2, శివమ్‌ దూబే 6-0-32-1, అక్షర్‌ 9-1-35-1.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 04:14 AM