Share News

రోహిత్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచే చివరిదా?

ABN , Publish Date - Jul 17 , 2026 | 09:28 AM

టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచే చివరిది కానుందా.?

రోహిత్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచే చివరిదా?
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరిందా? ఈ నెల 19న లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేనే అతడి కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుందా? అనే ప్రశ్నలకు జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అయితే.. దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మతో సమావేశమయ్యారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ను సిద్ధం చేయడంపై చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా రోహిత్‌ను ఇకపై వన్డేలకు దూరంగా ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నిర్ణయంపై హిట్‌మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడని కూడా నివేదికలు పేర్కొన్నాయి.


కాగా.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వన్డేల్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి రోహిత్‌కు 40 ఏళ్లు దాటనున్న నేపథ్యంలో భవిష్యత్తు జట్టును సిద్ధం చేయడంపై బీసీసీఐ దృష్టి సారించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

రోహిత్ ఇప్పటివరకు 286 వన్డేల్లో 11,731 పరుగులు సాధించాడు. 56 వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన హిట్‌మ్యాన్.. 2023 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడం సహా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రోహిత్ భవితవ్యం ఏంటనే దానిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిఉంది. అప్పటివరకు ఇవన్నీ ఉహాగానాలే.


ఇవీ చదవండి:

గెలిచి..నిలిచిన ఇంగ్లండ్‌

వరల్డ్‌ నెం.5కి సింధు షాక్‌

Updated Date - Jul 17 , 2026 | 09:35 AM