Share News

ఫిఫా వరల్డ్ కప్ జోష్: హైదరాబాద్‌లో బార్ల వేళల పొడిగింపు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:56 PM

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 19న స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫిఫా వరల్డ్ కప్ జోష్: హైదరాబాద్‌లో బార్ల వేళల పొడిగింపు!
Hyderabad bars timing

హైదరబాద్, జులై 17: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 19న స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ కోసం తలపడనున్నాయి. అలానే జులై 18న మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడా అభిమానులకు, నగరవాసులకు తీపి కబురు అందించింది. జూలై 18, 19 తేదీల్లో జరిగే అత్యంత కీలకమైన మ్యాచ్‌ల వీక్షణ కోసం హైదరాబాద్‌ గ్రేటర్ పరిధిలో బార్ల పనివేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జులై 18, 19 తేదీల్లో రాత్రి తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. అలాగే, జూలై 19న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ వీక్షణ కోసం 19-20 మధ్య తెల్లవారుజామున 3:00 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చారు. ఈ ప్రత్యేక వెసులుబాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (కమిషనరేట్ల) పరిధిలోని లైసెన్స్ పొందిన 2B బార్లు, C1 క్లబ్బులు, TD1, TD2 (టూరిజం బార్లు), మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.Untitled-9.jpg


మ్యాచ్‌లను హోటళ్లు, పబ్‌లలో లైవ్‌ స్క్రీనింగ్ ద్వారా వీక్షించేందుకు వీలుగా బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థన మేరకు సర్కార్ ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే, నిర్దేశిత సమయాలు దాటిన తర్వాత విక్రయాలు జరపరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎక్సైజ్, పోలీసు అధికారులు బార్ల యాజమాన్యాలను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!

మహిళల హాకీ ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన

Updated Date - Jul 17 , 2026 | 07:02 PM