లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:41 PM
భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ లండన్ చేరుకున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ లండన్ చేరుకున్నట్లు సమాచారం. దీంతో ఈ మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో చివరి వన్డే కావచ్చనే ప్రచారం మరింత ఊపందుకుంది.
రోహిత్ శర్మ తల్లిదండ్రులు లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రోహిత్ కుటుంబం లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే వెలువడిన పలు మీడియా కథనాల ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వన్డే జట్టులో రోహిత్ స్థానంపై అనిశ్చితి నెలకొంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రోహిత్ 11, 26 పరుగులకే పరిమితమవడంతో విమర్శలు మరింత పెరిగాయి. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో లార్డ్స్ వేదికగా జరిగే చివరి వన్డే అనంతరం ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!
మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్