ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 23 , 2026 | 07:08 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 23, 2026 21:38 IST
సరిహద్దుల్లో విదేశీ కరెన్సీతో ఉన్న రెండు బెలూన్ల స్వాధీనం
ఒక బెలూన్‌పై అంటించిన 5000 రూపాయల పాకిస్థానీ కరెన్సీ నోటు..
మరో బెలూన్‌పై అమెరికా డాలర్..
విచారణ జరుపుతున్న అధికారులు..
-
Feb 23, 2026 21:36 IST
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్..
చక్కటి పనితీరు కనబర్చే ఉద్యోగులకు ఇకపై ప్రభుత్వం నుంచి అభినందన లేఖలు..
తాగునీటి శాంపిళ్ల పరీక్షలకు మొబైల్ ల్యాబులను అందుబాటులోకి తేవాలి..
ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Feb 23, 2026 21:12 IST
అత్యధిక స్కోర్ నమోదు చేసిన వెస్టిండీస్..
T20 WC సూపర్-8: జింబాబ్వే టార్గెట్ 255 పరుగులు
వెస్టిండీస్ స్కోర్- 254/6..
ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన వెస్టిండీస్..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ నమోదు..
-
Feb 23, 2026 21:11 IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు
మార్చి 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు..
మార్చి 16న గవర్నర్ ప్రసంగం..
మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం..
మార్చి 20న తెలంగాణ వార్షిక బడ్జెట్..
-
Feb 23, 2026 20:59 IST
రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం..
సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ క్యాబినెట్..
పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం..
ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ క్యాబినెట్..
-
Feb 23, 2026 20:55 IST
శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై అధికారులతో మాట్లాడిన మంత్రి నారాయణ
జిల్లా కలెక్టర్, DMHO, కార్పొరేషన్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ..
డయేరియా ప్రబలడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి..
ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారుల వెల్లడి..
-
Feb 23, 2026 20:23 IST
మీ ఆస్తులు ప్రకటిస్తారా... స్టాలిన్‌కు విజయ్ సవాల్
అవినీతిని ప్రశ్నిస్తే ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శ..
టీవీకే, డీఎంకే మధ్యనే నిజమైన ఎన్నికల యుద్ధం..
తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం..
-
Feb 23, 2026 19:58 IST
రాజమండ్రిలో పాల వ్యాపారి అడ్డాల గణేష్ అరెస్ట్..
రాజమండ్రి: పాల వ్యాపారి అడ్డాల గణేష్ అరెస్ట్..
అడ్డాల గణేష్‌పై హత్యానేరం కేసు నమోదు..
పాలలో కల్తీ జరిగినట్లు పోలీసులు నిర్ధారణ..
-
Feb 23, 2026 19:40 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు..
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ నిర్ణయం..
ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు..
హైదరాబాద్ మెట్రోను L&T నుంచి పూర్తిగా స్వాధీనానికి కేబినెట్ ఆమోదం..
-
Feb 23, 2026 18:33 IST
సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతి..
రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం..
ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరిన ఈడీ..
రేపు , ఎల్లుండి రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఈడీ..
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రత..
-
Feb 23, 2026 18:19 IST
కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి బయటపడ్డ విభేదాలు..
తొలిసారి గెలిచిన 31 మంది ఎమ్మెల్యేలు.. రాహుల్‌కు లేఖ..
వెంటనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని డిమాండ్..
కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి..
-
Feb 23, 2026 18:16 IST
వడగళ్ల వాన బీభత్సం..
జయశంకర్ భూపాలపల్లి : మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో వడగళ్ల వాన బీభత్సం..
పలుచోట్ల తెగిపడిన విద్యుత్ వైర్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు..
మిర్చి, ఇతర పంటలకు తీవ్ర నష్టం..
-
Feb 23, 2026 17:54 IST
వికసిత వెస్ట్ బెంగాల్ సాధిద్దాం: మోదీ పిలుపు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ..
పశ్చిమబెంగాల్ భవితను నిర్ణయించే ఎన్నికలివి..
మీ నిర్ణయం మీదే సోనార్ బెంగ్లా కలల సాకారం..
ప్రజా సంక్షేమానికే 11 ఏళ్లుగా ఎన్డీయే కృషి చేస్తోంది: ప్రధాని మోదీ
-
Feb 23, 2026 17:19 IST
నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదు: కేటీఆర్
'కేటీఆర్ సేవా సమితి', 'కేటీఆర్ సేన' పేరుతో కార్యకలాపాలు చేపట్టొద్దు..
ఎవరైనా పనిచేయాలనకుంటే BRSతో కలిసి పనిచేయాలి: కేటీఆర్
-
Feb 23, 2026 17:15 IST
TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల
షెడ్యూల్ విడుదల చేసిన TG EdCET 2026 చైర్మన్, కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి..
ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్ గడువు..
-
Feb 23, 2026 17:05 IST
టీమిండియాకు ఇది గుణపాఠం: అశ్విన్
సరైన ప్రణాళిక లేకుండా మ్యాచ్‌లు ఆడొద్దు: అశ్విన్
అక్షర్ పటేల్‌ను తప్పించి సుందర్‌ని తీసుకోవడం సరైంది కాదు: అశ్విన్
-
Feb 23, 2026 16:14 IST
హైదరాబాద్‌లో ది హార్ట్ ఫోర్ట్ ఇండియా కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్: నానక్‌రాంగూడలో 'ది హార్ట్ ఫోర్ట్ ఇండియా' కార్యాలయం ప్రారంభం..
అమెరికా బీమా సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు..
ది హార్ట్ ఫోర్ట్ ఇండియా సంస్థ ద్వారా 1200 మంది ఉపాధి.
హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌గా మార్చే యత్నం: మంత్రి శ్రీధర్‌బాబు
-
Feb 23, 2026 16:08 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
480 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్..
142 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ..
-
Feb 23, 2026 16:03 IST
కాంగ్రెస్‌పై మళ్లీ మణిశంకర్ అయ్యర్ విమర్శల దాడి
ఇండియా కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకోవాలి..
ప్రాంతీయ పార్టీల నేతలకు బాధ్యతలు అప్పగించాలని సూచన..
మమతా బెనర్జీనే సరైన నాయకురాలని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ ప్రశంస..
-
Feb 23, 2026 15:37 IST
సౌతాఫ్రికాపై ఓటమి.. ఈ మ్యాచ్ నిజంగా సిగ్గు చేటు: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
సూపర్- 8లో సౌతాఫ్రికాపై 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా..
కీలక మ్యాచ్‌లో ఇలా చేతులెత్తేయడం సరైంది కాదు: కపిల్ దేవ్
-
Feb 23, 2026 15:35 IST
ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు
తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్, పోలీసులు..
ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని గుర్తింపు..
ఢిల్లీలో పలు స్కూళ్లకూ బాంబు బెదిరింపులు..
-
Feb 23, 2026 15:23 IST
ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు
త్వరగా ఇరాన్ నుంచి రావాలని భారతీయులకు సూచన..
పాస్‌పోర్టులు, ఐడీ కార్డులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి..
ఇమిగ్రేషన్ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం సూచన..
ఇరాన్‌లో నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి..
ఇరాన్‌లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచనలు..
-
Feb 23, 2026 15:21 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం
బైకును ఢీ కొట్టిన వాటర్ ట్యాంకర్.. ఇద్దరి మృతి
ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు సయ్యద్ హుస్సేన్, అక్షిత..
సంతోష్‌నగర్‌లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్..
డ్యూటీ తర్వాత పార్ట్ టైమ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్న సయ్యద్..
ర్యాపిడో కస్టమర్‌గా ప్రయాణం చేస్తున్న అక్షిత ప్రమాదంలో మృతి..
-
Feb 23, 2026 15:08 IST
సామాజిక సమానత్వమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది..
రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు..
సంక్షేమం విషయంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం..
ఆటోకార్మికులు, మత్స్యకారులు, చేనేతలకు కూడా మేలు చేశం: సీఎం చంద్రబాబు నాయుడు
-
Feb 23, 2026 14:32 IST
ముగిసిన శాసనమండలి BAC సమావేశం
రేపు హోంశాఖపై మండలిలో చర్చ..
ఈ నెల 25న వ్యవసాయ శాఖపై చర్చ
26 న మండలిలో లడ్డులో నెయ్యి కల్తీపై చర్చ
28 న మండలికి సెలవు.. తిరిగి వచ్చే నెల 4న మండలి సమావేశాలు..
-
Feb 23, 2026 14:30 IST
మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..
మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ..
శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న మంత్రివర్గం..
వచ్చే 3 నెలల పాటు తాగునీటి సరఫరా ప్రణాళికపై చర్చ..
-
Feb 23, 2026 14:29 IST
పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క సమావేశం
మహిళా అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత మెరుగుదలకు..
అవలంభించాల్సిన విధానంపై కీలక శాఖల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి..
మహిళా ఉన్నతాధికారులతో సబ్ కమిటీలు వేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు
-
Feb 23, 2026 14:17 IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన బాధాకరం: సీఎం చంద్రబాబు
నలుగురు చనిపోయారు, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు: సీఎం చంద్రబాబు
మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది..
పాలతోనే డయాలసిస్ సమస్య వచ్చింది..
కల్తీ పాల బాధ్యులను వదిలేది లేదు: సీఎం చంద్రబాబు నాయుడు
-
Feb 23, 2026 14:01 IST
10వ తరగతి విద్యార్థిపై దాడి! 30 సెకెన్లలో 27 కత్తిపోట్లు
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ స్నూకర్ క్లబ్‌లో ఫిబ్రవరి 15న ఘటన
గతంలో తమపై చేయి చేసుకున్నందుకు విద్యార్థిపై ఇద్దరు టీనేజర్ల దాడి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
-
Feb 23, 2026 13:53 IST
నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై రేపు ఏపీ అసెంబ్లీలో చర్చ
రేపు జీరో అవర్ రద్దు, ఉ.10:30 నుంచి మ.2గంటల వరకు చర్చ
కూటమికి చెందిన 10మంది MLAలతో మాట్లాడించాలని నిర్ణయం
మ.12:30 నుంచి లడ్డూ రసాయనాల అంశంపై సీఎం ప్రసంగం
-
Feb 23, 2026 13:51 IST
టీటీడీ నిబంధనలు కఠినతరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
అన్యమతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే..
డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇకపై కఠినతరం చేయాలని నిర్ణయం
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఉన్న ప్రత్యేక చట్టాన్ని..
తిరుమలలో అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం
స్వర్ణదేవాలయ చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
-
Feb 23, 2026 13:50 IST
అమరావతి: రాజీనామా చేసిన వైసీపీ MLCలకు చైర్మన్ నోటీసులు
తన ముందు హాజరై రాజీనామాపై వివరణ ఇవ్వాలని సూచన
ఈనెల 25న హాజరుకావాలని జయమంగళం వెంకటరమణకు నోటీస్
26న హాజరుకావాలని కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌కు చైర్మన్ నోటీసులు
27న హాజరుకావాలని MLCలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి నోటీసులు
-
Feb 23, 2026 13:49 IST
బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవు: నిర్మల
ఈ పరిణామాలను ఆర్బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోంది: నిర్మల
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు: ఆర్థిక మంత్రి నిర్మల
-
Feb 23, 2026 13:48 IST
ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి ఫేక్ బాంబు బెదిరింపు
ఎర్రకోట, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదన్న పోలీసులు
ఢిల్లీలోని పలు స్కూళ్లకూ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్
-
Feb 23, 2026 13:35 IST
సుంకాలను నిలిపివేస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన
ఐఈఈపీఏ చట్టం కింద సుంకాల విధింపును మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్టు వెల్లడి
ఇప్పటికే వాణిజ్య చట్టం కింద కొత్త సుంకాలకు తెరతీసిన అధ్యక్షుడు ట్రంప్
శాశ్వత సుంకాల విధింపునకు మార్గాలను అన్వేషించాలని అధికారులకు ఆదేశాలు
-
Feb 23, 2026 12:53 IST
అభిషేక్ అందుకే ఆడలేకపోయాడు: సునీల్ గావస్కర్
అభిషేక్ శర్మ ఒత్తిడి వల్లే స్వేచ్ఛగా ఆడలేకపోయాడు: గావస్కర్
సౌతాఫ్రికా బౌలర్లు తెలివిగా వ్యూహరచన చేశారు: గావస్కర్
-
Feb 23, 2026 12:19 IST
రాజమండ్రిలో 4కు చేరిన అనూరియా వ్యాధి మృతులు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12 మంది బాధితులకు చికిత్స: కలెక్టర్ కీర్తి చేకూరి
ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించాం: కలెక్టర్
పాల శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్‌కు పంపాం: కలెక్టర్ కీర్తి చేకూరి
అనూరియా కేసుల సమాచారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
అనుమానిత లక్షణాలుంటే 94940 60060కు సమాచారం ఇవ్వాలి: కలెక్టర్
విజయవాడ నుంచి ప్రత్యేక టీమ్స్‌తో విచారణ: ఎస్పీ కిషోర్
పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులపై కేసులు: ఎస్పీ కిషోర్
-
Feb 23, 2026 12:18 IST
సుప్రీంకోర్టులో సుబ్రమణ్యస్వామికి దక్కని ఊరట
తిరుమల లడ్డూ రసాయనాల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి కోర్టు గ్రీన్‌సిగ్నల్
సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్యస్వామి పిటిషన్
పిటిషన్‌ను తోసిపుచ్చిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ అంటున్న టీడీపీ
సుబ్రమణ్యస్వామితో పిటిషన్ వేయించింది వైసీపీయే అంటున్న టీడీపీ
-
Feb 23, 2026 11:53 IST
తిరుమల నెయ్యిపై హైడ్రామా
ఏపీ శాసన మండలిలో తిరుమల నెయ్యిపై హైడ్రామా
వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ
చైర్మన్ పోడియంపై వైసీపీ సభ్యుల నిరసన
గందరగోళంతో శాసన మండలి వాయిదా
పోడియం ఎక్కడంపై టీడీపీ మండిపాటు
మార్షల్స్‌ను పిలవాలని ఆలపాటి డిమాండ్
-
Feb 23, 2026 11:51 IST
తేజస్ యుద్ధ విమానాలను పక్కనపెట్టిన వాయుసేన..!
ఈనెల మొదట్లో తేజస్ జెట్ ప్రమాదానికి గురైనట్టు జాతీయ మీడియా కథనాలు
తనిఖీల కోసం తేజస్ జెట్స్‌ను ఎయిర్‌ఫోర్స్ పక్కనపెట్టిందంటూ వార్తలు
వార్తలపై ఇంకా స్పందించని భారత వాయుసేన
-
Feb 23, 2026 11:34 IST
డ్రగ్స్ ముఠా నాయకుడు హతం! మెక్సికోలో కల్లోలం
ఎల్ మెంచో హతమవడంతో రెచ్చిపోతున్న అల్లరి మూకలు
దేశంలో పలు చోట్ల పెట్రోల్ బంక్‌లు, షాపులు, కార్లకు నిప్పు
రోడ్లను ధ్వంసం చేసి వాహనాల రాకపోకలకు ఆటంకాలు సృష్టిస్తున్న వైనం
-
Feb 23, 2026 11:23 IST
రాజమండ్రిలో అనూరియా వ్యాధి మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం
బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని సీఎంకు వివరించిన అధికారులు
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
-
Feb 23, 2026 10:45 IST
ఎన్టీఆర్: మైలవరంలో ఫ్లెక్సీల కలకలం
నారాయణ థియేటర్ దగ్గర మహా పాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు
వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ నిజమే అంటూ ఫ్లెక్సీలు
-
Feb 23, 2026 10:45 IST
హైదరాబాద్: గంజాయి గ్యాంగ్ దాడిలో గాయపడ్డ యువకుడు మృతి
4 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ హఫీజ్ మృతి
మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ను ప్రశ్నించడంతో హఫీజ్‌పై దాడి
ఇప్పటికే నలుగురు అరెస్ట్, పరారీలో ఉన్నవారి కోసం గాలింపు
-
Feb 23, 2026 10:44 IST
కామారెడ్డి: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి అస్వస్థత
జ్వరంతో బాధపడుతున్న వెంకటరమణారెడ్డి
వెంకటరమణారెడ్డి ఇంట్లో కొనసాగుతోన్న వైద్య పరీక్షలు
-
Feb 23, 2026 10:36 IST
ఘోర పరాజయం.. గంభీర్‌పై విమర్శలు
టీ-20 ప్రపంచ కప్: టీమిండియా ఘోర పరాజయం.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు
సూపర్-8లో భాగంగా సౌతాఫ్రికాపై 76 పరుగుల తేడాతో ఓడిన భారత్
గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలపై మరోసారి విమర్శలు
అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించటంపై ట్రోల్స్
-
Feb 23, 2026 10:35 IST
భగ్గుమన్న బంగారం, వెండి ధరలు!
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండి ధరల్లో మళ్లీ దూకుడు
సోమవారం రూ.2వేల మేర పెరిగి రూ.1.6 లక్షల మార్కును దాటిన పసిడి
రూ.25వేల పెరుగుదలతో రూ.3లక్షల మార్కును చేరిన వెండి
-
Feb 23, 2026 10:01 IST
ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజును కలిసిన కూటమి ఎమ్మెల్సీలు
చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో...
సభకు వచ్చిన ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్
సభ సజావుగా నడిచేలా చూడాలని కోరిన కూటమి నేతలు
-
Feb 23, 2026 09:55 IST
ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: మంత్రి నారా లోకేశ్
జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టులు: లోకేశ్
ఇతర రాష్ట్రాల్లో KGBV అడ్మిషన్లు జరగడం లేదు: లోకేశ్
కానీ మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉంది: మంత్రి లోకేష్
ఉన్నత విద్యలో ఇంజినీరింగ్‌తో పాటు..
పాలిటెక్నిక్, ఐటీఐ కూడా ఎంతో కీలకం: మంత్రి లోకేశ్
-
Feb 23, 2026 09:47 IST
చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో భారీ మోసం
IDFC ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల స్కామ్
హరియాణా ప్రభుత్వ విభాగాలకు చెందిన అకౌంట్లలో గోల్‌మాల్
బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన హరియాణా ప్రభుత్వం
-
Feb 23, 2026 09:27 IST
ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకూ పరీక్షలు
మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది హాజరు
రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
-
Feb 23, 2026 09:23 IST
అమరావతి: మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్
లడ్డూ రసాయనాల కేసులో వాస్తవాలను రేపు అసెంబ్లీలో పెడతాం: మంత్రి లోకేశ్
దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీలో బయటపెడతాం: లోకేశ్
అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు: లోకేశ్
సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత: మంత్రి లోకేశ్
దేవుడి ఫొటోతో చట్టసభల్లో ర్యాలీలు అభ్యంతరకరం: లోకేశ్
-
Feb 23, 2026 09:22 IST
ప్రారంభమైన ఏపీ శాసనసభ
ప్రశ్నోత్తరాలు ప్రారంభించిన స్పీకర్
-
Feb 23, 2026 09:11 IST
నోటీసులు ఇచ్చినా స్పందించని సునీల్ నాయక్
పలుమార్లు నోటీసులు ఇచ్చినా సునీల్ నాయక్ హాజరుకాకపోవడంతో..
అదుపులోకి తీసుకున్న పోలీసులు
బిహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన ఏపీ అధికారులు
పట్నా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా..
ఇవాళ రాత్రికి గుంటూరు తీసుకురానున్న ఏపీ పోలీసులు
-
Feb 23, 2026 09:11 IST
రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం
సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
బిహార్‌లోని పట్నాలో ఐజీగా పనిచేస్తోన్న సునీల్ నాయక్
వైసీపీ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ ఐజీగా డిప్యూటేషన్
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో..
సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామ ఫిర్యాదు
-
Feb 23, 2026 08:28 IST
తిరుమలలో భక్తురాలికి పాము కాటు అంటూ ప్రచారం
పాము కాటు ప్రచారంపై స్పందించిన టీటీడీ
దర్శన క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు అనే ప్రచారం అవాస్తవం: టీటీడీ
ఆర్బీ సెంటర్ వద్ద భక్తురాలు మౌనిక తన పాదాలకు స్పర్శ తగలగానే భయభ్రాంతులకు గురయ్యారు: టీటీడీ
మౌనిక భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది: టీటీడీ
ఆస్పత్రికి తరలించగా పాము కాటు వేయలేదని వైద్యులు తెలిపారు: టీటీడీ
పాము కనిపించిన ప్రాంతం క్యూ లైన్ కాదు: టీటీడీ
-
Feb 23, 2026 08:14 IST
నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం
ధాడింగ్ జిల్లా బైసిగూడ సమీపంలో నదిలో పడ్డ బస్సు
18మంది మృతి, 28మందికి గాయాలు
-
Feb 23, 2026 07:49 IST
నేడు ఉభయ సభల్లోనూ చర్చలు..
ఉ.9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉ.10 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి
-
Feb 23, 2026 07:32 IST
డ్రగ్ లార్డ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 'ఎల్ మెంచో' హతం
మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతం
అమెరికా నిఘా సంస్థల సహకారంతో మెక్సికో సైన్యం భారీ ఆపరేషన్
జలిస్కో రాష్ట్రంలోని తపల్ప పట్టణంలో భీకర కాల్పులు
గాయపడిన మెంచోను హెలికాప్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మరణం
అనుచరుల హింసతో జలిస్కో రాష్ట్రవ్యాప్తంగా 'రెడ్ కోడ్' అమలు
CJNG కార్టెల్ స్థాపించి వేల సంఖ్యలో హత్యలకు పాల్పడిన ఎల్ మెంచో
-
Feb 23, 2026 07:30 IST
రేపు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు
12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, జీతాలు పెంచాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు నిర్ణయం
-
Feb 23, 2026 07:29 IST
కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
కలెక్టరేట్‌లో తేల్చుకుందామని ఎమ్మెల్యే కేవీఆర్ ప్రకటన
ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే కేవీఆర్
కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని సవాల్
-
Feb 23, 2026 07:13 IST
రాజమండ్రి: లాలా చెరువులో కలకలం
అంతుచిక్కని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన స్థానికులు
ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిరేటర్‌పై ఇద్దరికి చికిత్స
మరొకరి పరిస్థితి విషమం
మూడేళ్ల బాలుడికి డయాలసిస్ చేయాలన్న వైద్యులు
పాలు, నీళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు
రిపోర్ట్స్ వచ్చాకే క్లారిటీ వస్తుందంటున్న అధికారులు
-
Feb 23, 2026 07:12 IST
గోల్డ్ రేట్.. రూ.1.6 లక్షల మార్కును దాటే ఛాన్స్!
హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,570
కిలో వెండి ధర రూ.2,89,900
ఈ వారం గోల్డ్ రేట్స్ మరింత పెరిగే ఛాన్స్
పసిడి ధర రూ.1.6 లక్షల మార్కును దాటొచ్చంటున్న నిపుణులు
-
Feb 23, 2026 07:10 IST
హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 3గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ
GHMC, MPTC, ZPTC ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్
రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం
మెట్రో తొలిదశ టేకోవర్‌పైనా చర్చించనున్న కేబినెట్