ఏపీ శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ సభ్యులు.. సభ కాసేపు వాయిదా!, టీడీపీ మండిపాటు
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:21 AM
ఏపీ శాసన మండలిలో ఇవాళ(సోమవారం) హైడ్రామా చోటుచేసుకుంది. 8వ రోజు సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభ దద్దరిల్లింది.
అమరావతి, ఫిబ్రవరి 23: అమరావతిలో జరుగుతోన్న ఏపీ శాసన మండలి సమావేశాలు ఎనిమిదో రోజైన ఇవాళ ఉద్రిక్తంగా మారాయి. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ గందరగోళంగా మారింది.
వాయిదా తీర్మానం తిరస్కరణ
సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు తిరుమల నెయ్యి అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే, మండలి చైర్మన్ దీనిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ వైసీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు.
పోడియంపైకి వైసీపీ సభ్యులు
నిరసన మరింత ముదరి వైసీపీ సభ్యులు ఏకంగా చైర్మన్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ చర్యతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
టీడీపీ సభ్యుల ఘాటు విమర్శలు
వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. పోడియం ఎక్కడం చైర్మన్ స్థానాన్ని అవమానపరచడమేనని ఆయన విమర్శించారు. సభను క్రమపద్ధతిలో ఉంచేందుకు మార్షల్స్‌ను పిలిపించి, నిరసనకారులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. సభ్యుల అతిని అదుపు చేయకపోతే చైర్మన్ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఈ వార్తలూ చదవండి:
కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్‌పై పిడిగుద్దులు
వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..