కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్‌పై పిడిగుద్దులు
ABN , Publish Date - Feb 21 , 2026 | 08:08 AM
కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతూ దొరికిపోయిన ఓ విద్యార్థి చివరకు ఇన్విజిలేటర్‌పైనే దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కర్నాటకలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పరీక్షా కేంద్రంలో కాపీ కొడుతూ పట్టుబడ్డ ఓ విద్యార్థి ఏకంగా ఇన్విజిలేటర్‌పై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. విద్యార్థిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Student Attack Professor in Karnataka).
కలబురగిలోని ఓ హోమియోపతి కళాశాలలో ఇంటర్నల్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడ్డ విద్యార్థిని కేరళకు చెందిన షహబాజ్‌గా గుర్తించారు. మెటీరియా మెడికా పరీక్ష సందర్భంగా అతడు మొబైల్ ఫోన్ సాయంతో కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరాజ్ కుమార్ ఈ విషయాన్ని గుర్తించి షహబాజ్ సమాధాన పత్రాలను తీసుకున్నారు. పరీక్షా కేంద్రాన్ని వీడాలని అతడిని ఆదేశించారు.
అక్కడి నుంచి వెళ్లిన షహబాజ్ మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి ప్రొఫెసర్‌పై చేయిచేసుకున్నాడు. పిడిగుద్దులు కురిపించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈలోపు ఇతర విద్యార్థులు అతడిని అడ్డుకున్నారు.
ఆ వెంటనే కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తదుపరి పరీక్షలకు హాజరు కాకుండా అతడిపై నిషేధం విధించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి అధ్యాపకుడు పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఈ ఉదంతంపై అంతర్గత దర్యాప్తును కాలేజీ ప్రారంభించిందని సమాచారం. దర్యాప్తు పూర్తయ్యాక తగు చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలూ చదవండి:
వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..
ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ! ఇంతలో ఊహించని విధంగా..