పాము కాటు.. అవాస్తవం: టీటీడీ
ABN , Publish Date - Feb 23 , 2026 | 07:54 AM
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తురాలిని పాము కాటు వేయలేదని టీటీడీ ప్రకటించింది. ఆ ప్రచారమంతా అవాస్తమని తెలిపింది.
తిరుమల, ఫిబ్రవరి 23: శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తురాలిని పాము కాటు వేయలేదని టీటీడీ ప్రకటించింది. ఆ ప్రచారమంతా అవాస్తమని తెలిపింది. సోమవారం ఈ వ్యవహారంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన భక్తురాలు మౌనిక పాదాలకు ఆర్బీ సెంటర్ వద్ద స్పర్శ తగలగానే భయభ్రాంతులకు గురైందని చెప్పింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న తన భర్తకు ఆమె తెలియజేశారంది. దీంతో ఆ ప్రాంతాన్ని అతను పరిశీలించగా.. ఓ చిన్నపాము కనిపించిందని టీటీడీ పేర్కొంది. ఆమెను వెంటనే స్థానిక అశ్వినీ ఆసుపత్రికి తరలించారని చెప్పింది. మౌనిక పాదాలను పరిశీలించిన వైద్యులు.. పాము కాటు వేయలేదని చెప్పారంది. అంతేకానీ క్యూ లైన్‌లో మాత్రం పాము కనిపించలేదని టీటీడీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
పాము కాటుపై స్పందించిన మౌనిక భర్త..
మరోవైపు మౌనికకు పాము కాటు వేయలేదని ఆమె భర్త శరత్ బాబు వెల్లడించారు. పాము కాటుకు సంబంధించిన వివరణను ఆయన ఇచ్చారు. స్వామివారి దర్శనార్థం క్యూ లైన్‌లోకి వెళ్లేందుకు మ్యూజియం వద్దకు తాము వచ్చామన్నారు. ఆ సమయంలో పసుపు రాసుకునేందుకు మౌనిక పక్కకు వెళ్లిందని చెప్పారు. పాదాలకు ఏదో పాకినట్లుగా ఉందని చెబితే.. పరిశీలించామన్నారు. చిన్న పాములా ఉందని గుర్తించామని తెలిపారు. చికిత్స కోసం అశ్వినీ ఆసుపత్రికి వెళ్లామన్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత.. మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించారని పేర్కొన్నారు. అక్కడ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అనంతరం పాము కాటు వేయలేదని వైద్యులు తెలిపారన్నారు. మౌనిక పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో స్విమ్స్ నుంచి మౌనికను వైద్యులు డిశ్చార్జ్ చేశారని ఆమె భర్త శరత్ బాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనూరియా కేసులో నలుగురికి చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరు: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News