Share News

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

ABN , Publish Date - Feb 23 , 2026 | 09:00 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:00 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

అమరావతి, ఫిబ్రవరి 23: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:00 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హజరుకానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 5,31,275 మంది విద్యార్థులు హజరయ్యారు. రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి మొదలయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది విద్యార్థులు హజరుకానున్నారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష ప్రారంభ సమయం కంటే దాదాపు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం1,537 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు సహా ఎలాంటి గాడ్జెట్‌లకు అనుమతి లేదని ఇప్పటికే విద్యార్థులకు బోర్డు స్పష్టం చేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.


ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌, కామర్స్‌, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. మిగిలిన, బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులకు, రెండో సంవత్సరం అన్ని సబ్జెక్టులకూ 24 పేజీల బుక్‌లెట్‌ను అందజేయనున్నారు. ఈ బుక్‌లెట్‌లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు.


ఇవీ చదవండి:

రిటైర్మెంట్‌ వరకూ సస్పెన్షన్‌లోనే!

ఆ పోలీసులపై క్రిమినల్‌ చర్యలు?

Updated Date - Feb 23 , 2026 | 09:36 AM