పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:19 PM
జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో విదేశీ కరెన్సీ నోట్లు తగిలించిన రెండు బెలూన్లను అధికారులు సోమవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై 5,000 రూపాయల పాకిస్థా్న్ కరెన్సీ నోటు, అమెరికా డాలర్ అంటించి ఉన్నాయి.
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో విదేశీ కరెన్సీ నోట్లు తగిలించిన రెండు బెలూన్లను అధికారులు సోమవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై 5,000 రూపాయల పాకిస్థాన్ కరెన్సీ నోటు, అమెరికా డాలర్ అంటించి ఉన్నాయి. విమానం ఆకృతిలోని తెలుపు, ఎరుపు రంగు బెలూన్లు గునరా గ్రామంలో చెట్టుకు చిక్కుకుని కనిపించినట్టు అధికారులు తెలిపారు.
పాక్ మెుబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్
బెలూన్లపై పాకిస్థాన్ మొబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఉన్నట్టు గుర్తించామని, పాకిస్థాన్ వైపు నుంచి భారత సరహద్దులోకి ఇవి ప్రవేశించాయని అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి బెలూన్లు తరచుగా గాలికి కొట్టుకువస్తుంటాయని, అయితే బెలూన్లకు విదేశీ కరెన్సీ నోట్లు తగిలించి ఉండటం ఇదే మొదటిసారని చెప్పారు.
కాగా, పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన 16 ఎరుపురంగు బెలూన్లను సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్ఎఫ్) ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్‌లోని పంటపొలాల్లో వీటిని గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
మీ ఆస్తులు ప్రకటిస్తారా... స్టాలిన్‌కు విజయ్ సవాల్
తమిళనాడు ఎస్ఐఆర్ తుది జాబితా విడుదల.. 74 లక్షల మంది ఓటర్ల తొలగింపు