Share News

10వ తరగతి విద్యార్థిపై దాడి! 30 సెకెన్లలో 27 కత్తిపోట్లు

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:43 PM

భోపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఇద్దరు బాలురు కత్తులతో దాడి చేశారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు.

10వ తరగతి విద్యార్థిపై దాడి! 30 సెకెన్లలో 27 కత్తిపోట్లు
Bhopal Student Stabbed in Snooker Club

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల మధ్య గొడవ షాకింగ్ మలుపు తిరిగింది. సాటి విద్యార్థుల దాడిలో ఓ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిపై ఇద్దరు టీనేజర్లు దాడికి తెగబడి అర నిమిషంలో 30 సార్లు కత్తులతో ఇష్టారీతిన పొడిచారు. భోపాల్‌లో ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను టీనేజర్లు స్వయంగా నెట్టింట పంచుకున్నట్టు తెలుస్తోంది(Bhopal Stabbed in Snooker Club).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఓ స్నూకర్ క్లబ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. స్నూకర్ క్లబ్‌లోకి రాగానే బాధితుడిపై ఇద్దరు బాలురు ఇష్టారీతిన దాడికి దిగారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు. ఈ దాడిలో బాధితుడి భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగిపడ్డాయి. బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నాడు. సినీఫక్కీలో నిమిషాల వ్యవధిలో దాడిచేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


ముగ్గురు టీనేజర్లు స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్‌లో చదువుకునే వారని పోలీసులు తెలిపారు. అయితే, ఆటలో పైచేయి ఎవరిదనే విషయంలో వారి మధ్య గతంలో వివాదం చెలరేగిందని తెలిపారు. ఆ సమయంలో బాధితుడు ఇద్దరు టీనేజర్లపై చేయి చేసుకున్నాడని చెప్పారు. ఇందుకు ప్రతీకారంగానే వారు ఇలా దాడికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి గాయాల తీవ్రతను బట్టి అదనపు సెక్షన్లను జోడిస్తామని తెలిపారు. ఇక టీనేజర్ల మధ్య ఈ స్థాయిలో వివాదం రేగడంతో భోపాల్‌లో కలకలానికి దారి తీసింది. తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఈ వార్తలూ చదవండి:

మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్

Updated Date - Feb 23 , 2026 | 02:22 PM