Share News

కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:27 PM

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మృతులు కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణిల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..

కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: సీఎం చంద్రబాబు
Rajahmundry adulterated milk case

అమరావతి, ఫిబ్రవరి 23: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కల్తీ పాల ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన తెలిపారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. మృతులు కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణిల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


పాలతోనే డయాలసిస్‌ సమస్య వచ్చిందన్నారు. కల్తీ పాల బాధ్యులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్ట్ చేశామని చెప్పారు. కల్తీ చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ పాల మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు.


కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో అనూరియా వ్యాధి మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరినగర్‌ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 15 నుంచి పలువురు.. వాంతులు, మూత్ర విసర్జన కాకపోవడం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రకమైన కారణాలతో 14 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణి మృతి చెందారు.


ఇవి కూడా చదవండి..

అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు..

తిరుమల లడ్డూ అంశం.. రేపు అసెంబ్లీలో కీలక చర్చ

Updated Date - Feb 23 , 2026 | 02:37 PM