తిరుమల లడ్డూ అంశం.. రేపు అసెంబ్లీలో కీలక చర్చ
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:56 PM
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో నెయ్యి బదులు రసాయనాల మిశ్రమం వినియోగంపై అసెంబ్లీ సాక్షిగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం అసెంబ్లీలో ఈ అంశంపై నాలుగు గంటలు చర్చించాలని నిర్ణయించారు.
అమరావతి, ఫిబ్రవరి 23: తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో నెయ్యి బదులు రసాయనాల మిశ్రమం వినియోగంపై అసెంబ్లీ సాక్షిగా చర్చించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం అసెంబ్లీలో ఈ అంశంపై నాలుగు గంటలపాటు చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం జీరో అవర్‌ను రద్దు చేసింది. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉదయం10.30 గంటల నుంచి నెయ్యి కల్తీ పై కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మాట్లాడించనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ కారణంగా ఆయన సోమవారం అసెంబ్లీకి హాజరుకాలేదు. రేపటి సభలో లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిబంధనలు మరింత కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనలు ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే.. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. అమృతసర్‌లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం వలే టీటీడీకు సైతం చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఇదే తరహా చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలంటూ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలం: హోం మంత్రి
అనూరియా కేసులో నాలుగుకు చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్
For More AP News And Telugu News