గోల్డ్ రేట్.. ఈ వారం రూ.1.6 లక్షల మార్కును దాటే ఛాన్స్
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:37 AM
గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ వారం కూడా ఇదే పంథా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత వారం ద్వితీయార్ధంలో బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. సుంకాలు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు తీర్పు, అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు బులియన్ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ఈ వారం కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,59,570గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,990. కిలో వెండి ధర రూ.2,89,900ల వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates Feb 23).
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర ఈ వారం రూ.1.6 లక్షల మార్కు, వెండి ధర రూ.3 లక్షల మార్చును దాటే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప దిద్దుబాట్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే పసిడి, వెండి ధరల్లో పెరుగుదల తప్పదని చెబుతున్నాయి.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,60,140; ₹1,46,790
ముంబై: ₹1,59,270; ₹1,45,990
ఢిల్లీ: ₹1,59,420; ₹1,46,140
కోల్‌కతా: ₹1,59,270; ₹1,45,990
బెంగళూరు: ₹1,59,270; ₹1,45,990
హైదరాబాద్: ₹1,59,270; ₹1,45,990
విజయవాడ: ₹1,59,270; ₹1,45,990
కేరళ: ₹1,59,270; ₹1,45,990
పుణె: ₹1,59,270; ₹1,45,990
వడోదరా: ₹1,59,320; ₹1,46,040
అహ్మదాబాద్: ₹1,59,320; ₹1,46,040
కిలో వెండి ధరలు
చెన్నై: ₹2,89,900
ముంబై: ₹2,74,900
ఢిల్లీ: ₹2,74,900
కోల్‌కతా: ₹2,74,900
బెంగళూరు: ₹2,74,900
హైదరాబాద్: ₹2,89,900
విజయవాడ: ₹2,89,900
కేరళ: ₹2,89,900
పుణె: ₹2,74,900
వడోదరా: ₹2,74,900
అహ్మదాబాద్: ₹2,74,900
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి:
ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
కాకినాడ పెన్సిలిన్-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి