దేశీయ సూచీలకు లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:44 PM
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు మళ్లీ లాభాలతో రోజును ముగించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలో నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు మళ్లీ లాభాలతో రోజును ముగించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలో నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో రోజంతా ఒడిదుడుకులకు లోనైన సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (82,814)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత సానుకూల వార్తలు రావడంతో లాభాల్లోకి దూసుకొచ్చింది. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే 500 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 141 పాయింట్ల లాభంతో 25,713 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఇండియన్ బ్యాంక్, కమిన్స్, సీమన్స్, అదానీ పోర్ట్స్, భారత్ ఫోర్జ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, డిక్సన్ టెక్నాలజీస్, కోఫోర్జ్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 92 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 258 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.88గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..