Share News

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:21 PM

ఆ 19 ఏళ్ల కుర్రాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయాలనుకున్నాడు.. ఫ్రెండ్ అడిగిన వెంటనే తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాడు.. చివరకు రూ.7 కోట్ల స్కామ్‌లో చిక్కుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..
Bengaluru cyber scam

ఆ 19 ఏళ్ల కుర్రాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయాలనుకున్నాడు.. ఫ్రెండ్ అడిగిన వెంటనే తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాడు.. చివరకు రూ.7 కోట్ల స్కామ్‌లో చిక్కుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు (Bengaluru cyber scam).


బెంగళూరులోని ఓ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల కుర్రాడికి గత నవంబర్‌లో అతడి స్నేహితుడు ఆయుష్ ఫోన్ చేశాడు. తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తన బ్యాంక్ అకౌంట్ బ్లాంక్ అయిందని, కొద్ది రోజుల పాటు వినియోగించుకోవడానికి బ్యాంక్ ఖాతా ఇవ్వాలని అడిగాడు. ఏడాదిగా పరిచయం ఉండడంతో ఆయుష్‌కు ఆ కుర్రాడు కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం కార్డ్, నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఆ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఎయిర్‌టెల్ సిమ్ కార్డును స్నేహితుడికి పంపించాడు. ఫిబ్రవరి 20వ తేదీన ఆ కుర్రాడిని కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారులు సంప్రదించారు (Rs 7 crore Scam).


ఆ ఖాతా ద్వారా షెల్ కంపెనీల పేర్లతో ఏడు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టు చెప్పారు (financial scam Bengaluru). విస్తుపోయిన కుర్రాడు తన స్నేహితుడు ఆయుష్ గురించి చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆ ఖాతా వివరాలను ఆయుష్ విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్టు బయటపడింది. దీంతో వెంటనే అధికారులు ఆ ఖాతాను బ్లాక్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ ఆశలు!

టీ20 ప్రపంచ కప్: టీమిండియా ఘోర పరాజయం.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు

Updated Date - Feb 23 , 2026 | 03:21 PM