Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 13 , 2026 | 06:55 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 13, 2026 21:35 IST

    అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నీ నదీ పరివాహకంలోనే ఉన్నాయి: సీఎం రేవంత్

    • సింగపూర్‌, దుబాయ్‌, లండన్‌, సియోల్‌ అన్నీ తిరిగొచ్చాం: రేవంత్

    • మనకు ఏం అవసరమో విదేశాల్లో స్టడీ చేసొచ్చాం: సీఎం రేవంత్

    • ఇతర దేశాలు వేగంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి: రేవంత్

    • ఇతర దేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు: సీఎం రేవంత్‌

    పూర్తి కథనం

  • Mar 13, 2026 21:34 IST

    ప్రజలు మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు: సీఎం రేవంత్‌

    • ప్రజలకు మేము కాపలాదారులుగా ఉంటాం: సీఎం రేవంత్

    • ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్‌

    • అభివృద్ధిని అందుకునేందుకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు: రేవంత్

  • Mar 13, 2026 21:33 IST

    హైదరాబాద్‌: మూసీ పునరుజ్జీవంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

    • MRDCL ఎండీ నరసింహారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

    • తొలిదశలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ ప్రణాళికపై ప్రజెంటేషన్‌

  • Mar 13, 2026 20:18 IST

    అమరావతి: మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంపై మంత్రి లోకేశ్ సమీక్ష

    • బ‌డి భోజ‌నం బాగోలేకపోతే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

    • ప్రతిరోజూ ఒక టీచ‌ర్ భోజ‌నం నాణ్యత ప‌రీక్షించాలి: లోకేశ్

    • సమూల మార్పుకు త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ: లోకేశ్

    • ఎమ్మెల్యేలు వారానికి ఒక స్కూల్‌ను సందర్శించాలి: లోకేశ్

  • Mar 13, 2026 20:05 IST

    ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ ఉత్తర్వులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఏసీబీ కోర్టు తన పరిధి దాటి పలు అంశాలను ప్రస్తావించింది: హైకోర్టు

    • అవి కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయి: హైకోర్టు

    • మిథున్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు ఏపీ హైకోర్ట్‌ నిరాకరణ

  • Mar 13, 2026 19:26 IST

    రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చాం: సీఎం చంద్రబాబు

    • రైతులు కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు: చంద్రబాబు

    • ఇప్పుడు ఒక్కో రైతుకు రూ.6 వేలు ఇస్తున్నాం: చంద్రబాబు

    • రైతు ఖాతాలో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నాం: చంద్రబాబు

    • కేంద్రం రూ.6 వేలు ఇస్తే.. మేం రూ.14 వేలు ఇస్తున్నాం: చంద్రబాబు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 19:25 IST

    ఏపీలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు

    • 10 రోజులపాటు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం

    • సింగిల్‌ స్ర్కీన్స్‌లో రూ.100 పెంపు

    • మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంపు

    • ఈనెల 19న బెనిఫిట్‌ షోకు అనుమతి

    • బెనిఫిట్‌ షో టికెట్‌ ధర రూ.500

    పూర్తి కథనం

  • Mar 13, 2026 19:22 IST

    మంత్రి పయ్యావుల కేశవ్‌తో హోటల్ అసోసియేషన్ సభ్యుల భేటీ

    • ఏపీ సచివాలయంలో మంత్రి పయ్యావులను కలిసిన విజయవాడ హోటల్ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు

    • వంటగ్యాస్ కొరత సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

    • హోటళ్లకు గ్యాస్ సరఫరా మరో రెండు రోజుల్లో ఆగిపోయే ప్రమాదం ఉందని అసోసియేషన్ ఆందోళన

    • గ్యాస్ ఆదా కోసం హోటళ్ల పనివేళలు కుదించడం, మెనూను తగ్గించడంపై ప్రతిపాదనలు

    • ప్రతి సోమవారం హోటళ్లకు సెలవు ప్రకటించాలని మంత్రికి విన్నపం

    పూర్తి కథనం

  • Mar 13, 2026 19:00 IST

    బండి సంజయ్‌ పాదయాత్ర

    • రేపు కొండగట్టు ఆలయానికి బండి సంజయ్‌ పాదయాత్ర

    • కరీంనగర్‌ నుంచి కొండగట్టు వరకు 40 కి.మీ. పాదయాత్ర

  • Mar 13, 2026 18:59 IST

    రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ సంస్థ మోసం కేసులో CBI దర్యాప్తు

    • అనిల్‌ అంబానీ కుమారుడు అన్మోల్‌ను ప్రశ్నించిన అధికారులు

  • Mar 13, 2026 18:59 IST

    సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్స్‌కు వంటగ్యాస్‌ సెగ

    • ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలో గ్యాస్‌ కొరత

    • విద్యార్థులకు కట్టెలతో మధ్యాహ్న భోజనం వండిన సిబ్బంది

  • Mar 13, 2026 18:58 IST

    తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు

    • సమస్యల పరిష్కారం కోరుతూ TGSRTC JAC సమ్మె నోటీసు

    • సమ్మె తేదీపై రెండు వారాల తర్వాత నిర్ణయం: TGSRTC JAC

    • రెండు వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు: TGSRTC JAC

  • Mar 13, 2026 18:57 IST

    నటి అనసూయపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు

    • కడప జిల్లాకు చెందిన జనార్దన్‌ను అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

    • సోషల్‌ మీడియాలో అనసూయపై జనార్దన్‌ అభ్యంతరకర పోస్టులు

    • అనసూయ ఫొటోలు, వీడియోలు మార్ఫ్‌ చేసి పోస్టులు

  • Mar 13, 2026 18:52 IST

    తెలంగాణలో భారీ GST కుంభకోణం

    • రూ.84.15కోట్ల మోసం గుర్తించిన వాణిజ్య పన్నులశాఖ

    • SKG ట్రేడింగ్‌ కంపెనీ యజమాని సందీప్‌ అరెస్టు

  • Mar 13, 2026 18:52 IST

    హైదరాబాద్‌: MRDCL ఆధ్వర్యంలో 'MUSI INVITIES' కార్యక్రమం

    • 'MUSI INVITIES' కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

    • హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు..

    • మేధావులు, పర్యావరణ నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు

  • Mar 13, 2026 17:58 IST

    సారా అంశంలో జడ్చర్ల MLA వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందన

    • ఇప్పసారా అంశంపై సాధ్యసాధ్యాలను అధ్యయనం చేస్తాం: జూపల్లి

    • రీసెర్చ్‌ నివేదికను MLA అనిరుధ్‌రెడ్డి అందించారు: మంత్రి జూపల్లి

    • సారా అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం: మంత్రి జూపల్లి

  • Mar 13, 2026 17:21 IST

    అమరావతి: ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌తో బిట్స్ పిలానీ ప్రతినిధుల భేటీ

    • ఇక్కడ నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌: సంస్థ ప్రతినిధులు

    • బిట్స్ చేపట్టిన నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్

    • సాధ్యమైనంత త్వరగా ఈ క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని లోకేశ్ సూచన

    పూర్తి కథనం

  • Mar 13, 2026 17:01 IST

    శ్రీకాకుళం: పలాసలో విజయవంతమైన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

    • కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో పూర్తయిన తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స

    • హేమశ్రీ అనే యువతికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్

  • Mar 13, 2026 16:36 IST

    అత్యవసర సేవలకు గ్యాస్‌ కొరత లేకుండా చూస్తాం: మంత్రి ఉత్తమ్‌

    • గ్యాస్‌ కొరత ఉన్నట్లు కేంద్రమే ప్రకటించింది: మంత్రి ఉత్తమ్‌

    • LPG ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం తెలిపింది: మంత్రి ఉత్తమ్‌

    • అత్యవసర సేవలుగా గుర్తించి గ్యాస్‌ సరఫరా చేయాలన్న..

    • హోటల్స్‌, రెస్టారెంట్ల విజ్ఞప్తిని పరిశీలిస్తాం: మంత్రి ఉత్తమ్‌

    పూర్తి కథనం

  • Mar 13, 2026 16:35 IST

    దేశంలో పెట్రోల్‌ కొరత లేదు: కేంద్రం

    • రాష్ట్రాలు బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలి: కేంద్రం

    • ప్రజలకు 24/7 PNG సరఫరా చేస్తాం: కేంద్రం

    • ప్రజలు PNG కనెక్షన్లు తీసుకుంటే మంచిది: కేంద్రం

    పూర్తి కథనం

  • Mar 13, 2026 16:34 IST

    హైదరాబాద్‌: గుర్రంగూడ అటవీప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటన

    • 424.31 ఎకరాలను రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    • గుర్రంగూడలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 16:34 IST

    వచ్చేవారం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

    • పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు

    • 5 రాష్ట్రాల్లో పూర్తయిన ఓటర్ల జాబితా సవరణ

  • Mar 13, 2026 16:20 IST

    ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం

    • విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి

    • సిబ్బంది మృతిని ధ్రువీకరించిన యూఎస్ సెంట్రల్ కమాండ్

    • విమానాన్ని తామే కూల్చేసినట్టు ప్రకటించిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్

  • Mar 13, 2026 16:00 IST

    కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం

    • పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు

    • పెద్దపులి మెడలో జీపీఎస్ రెడియో కాలర్ ఉన్నట్లు గుర్తింపు

    • పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామన్న అధికారులు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:59 IST

    బేజారెత్తిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు!

    • అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి

    • ఈరోజు భారీ కుదుపునకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు

    • ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు దాదాపు 2శాతం పతనం

  • Mar 13, 2026 15:58 IST

    ABN ఆంధ్రజ్యోతితో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి

    • మేము పోలీసులకు లొంగిపోలేదు: ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి

    • అరెస్ట్ చేసి లొంగుబాటు చూపించారు: మల్లా రాజిరెడ్డి

    • ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అనుకూల పరిస్థితులు లేవు: రాజిరెడ్డి

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:38 IST

    హెచ్.జె.దొర కన్నుమూత

    • ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ HJ దొర కన్నుమూత

    • అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:29 IST

    సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టులో ఊరట

    • టికెట్‌ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే

    • తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

    • సినిమా టికెట్‌ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే..

    • ప్రభుత్వం జీఓ జారీ చేయాలంటూ గతంలో హైకోర్టు నిబంధన

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:27 IST

    మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ

    • అలా చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న సుప్రీంకోర్టు

    • నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరన్న సుప్రీంకోర్టు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:27 IST

    ఈ విజయం యావత్ భారత దేశానిది: సూర్య

    • ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్

    • డియర్ టీమిండియా ఫ్యాన్స్.. మీకు కృతజ్ఞతలు: సూర్య

    • మీ మద్దతు, దీవెనల వల్లే టీ20 ప్రపంచ కప్ గెలిచాం: సూర్య

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:11 IST

    ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు

    • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పేలుడు

    • యుద్ధంలో ఇప్పటివరకు 1300 మందికిపైగా ఇరానియన్లు మృతి

    • మృతుల్లో 200 మందికిపైగా చిన్నారులు

  • Mar 13, 2026 15:10 IST

    స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌

    • భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

    • 1300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

    • 400 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

  • Mar 13, 2026 15:10 IST

    మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు: రాంచందర్‌రావు

    • పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    • మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకమంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం

    • ఇళ్లు కూల్చకుండా మూసీని శుద్ధి చేయొచ్చు: రాంచందర్‌రావు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:09 IST

    సీఈసీపై అభిశంసన తీర్మానం

    • CEC జ్ఞానేశ్‌ కుమార్ తొలగింపు కోరుతూ పార్లమెంట్‌లో విపక్షాల నోటీస్

    • లోక్‌సభ, రాజ్యసభలో అభిశంసన తీర్మానం ఇచ్చిన విపక్షాలు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 15:00 IST

    రంగారెడ్డి: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత

    • స్టైఫండ్ పెంచాలని పీజీ, పీహెచ్‌డీ స్కాలర్లు నిరసన

    • ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపిన విద్యార్థులు

  • Mar 13, 2026 14:59 IST

    భర్తను పకోడీ తీసుకురమ్మని పంపి పరారైన భార్య

    • యూపీలోని మొరాదాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    పూర్తి కథనం

  • Mar 13, 2026 14:43 IST

    తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • బెంగాల్‌లో ఆదివాసీల సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేయాలనుకున్న టీఎంసీ టీమ్

    • ఈనెల 9న రాష్ట్రపతికి లేఖ రాసిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్

    • ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై రాష్ట్రపతి అసంతృప్తి

    పూర్తి కథనం

  • Mar 13, 2026 14:42 IST

    సన్‌రైజర్స్ లీడ్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

    • విదేశీ లీగ్‌లో పాక్ ప్లేయర్ అబ్రార్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్ ఫ్రాంచైజీ

    • ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ

    • ఆ క్రికెటర్‌ను తీసుకోవడంపై మాకు ఎలాంటి సంబంధం లేదు: బీసీసీఐ

    పూర్తి కథనం

  • Mar 13, 2026 14:27 IST

    మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు: ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ

    • గణపతి ఎక్కడున్నాడో మాకు తెలియదు: దేవ్‌జీ

    • ప్రస్తుతం మావోయిస్టు పార్టీ క్షీణించింది: దేవ్‌జీ

    • ప్రభుత్వంతో పోరాటం సాధ్యం కాదు: దేవ్‌జీ

    • మావోయిస్టు పార్టీ నడపాలంటే డబ్బు అవసరం: దేవ్‌జీ

    • మా దగ్గర రూ.కోట్లు, బంగారం ఉందని దుష్ప్రచారం: దేవ్‌జీ

    • రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: దేవ్‌జీ

    పూర్తి కథనం

  • Mar 13, 2026 13:38 IST

    ప్రకృతి సాగు రైతు రోశయ్యకు సీఎం చంద్రబాబు ప్రశంస

    • 52 రకాల పంటలు సాగు చేస్తున్న గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన రైతు రోశయ్య..

    • 80 ఏళ్ల వయసులో ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రోశయ్య..

    • రైతు రోశయ్యకు నా ప్రణామాలు: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు

    పూర్తి కథనం..

  • Mar 13, 2026 13:36 IST

    ఈరోజు, రేపు విశాఖ, అల్లూరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పర్యటన..

    • అమరావతి: ఈరోజు, రేపు.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..

    • ఈరోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న పవన్ కల్యాణ్..

    • రేపు అల్లూరి జిల్లా పాడేరు మండలం నందిగరువులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..

    • ఇటీవల నిర్మించిన 'అడవి తల్లి బాట' రోడ్డును పరిశీలించనున్న పవన్ కల్యాణ్..

  • Mar 13, 2026 13:11 IST

    చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను అగ్ని ప్రమాదం..

    • ఆగి ఉన్న అంబులెన్స్‌లో మంటలు..

    • పక్కనే ఉన్న పలు వాహనాలకు అంటుకున్న మంటలు.

    • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

    • ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్న రోగులు, అధికారులు..

  • Mar 13, 2026 12:57 IST

    భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..

    • జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలం పెద్దాపూర్‌లో దారుణం..

    • ​భార్య తనకు మందు పెడుతోందనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డ భర్త..

    • ​భర్త దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన భార్య..

    • వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు సమ్మయ్య

  • Mar 13, 2026 12:46 IST

    కామారెడ్డిలో మరోసారి బాలికల అదృశ్యం

    • బాలసదన్‌ నుంచి ఉదయం 6గంటలకు ఇద్దరు బాలికల మిస్సింగ్..

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలసదన్ అధికారి..

  • Mar 13, 2026 12:45 IST

    హైదరాబాద్ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సంక్షోభం

    • గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటల్స్, రెస్టారెంట్లు..

    • ఇప్పటికే హైదరాబాద్‌లో 40శాతం హోటల్స్ మూసివేత..

    • కట్టెల పొయ్యిపై ఆధారపడుతున్న క్యాటరింగ్ వ్యాపారులు..

  • Mar 13, 2026 12:44 IST

    సంగారెడ్డి: పటాన్‌చెరులో వంట గ్యాస్ కష్టాలు

    • గ్యాస్ గోదాం దగ్గర LPG సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు..

    • సిలిండర్ బుక్ చేసినా డెలివరీ చేయడం లేదంటూ ఆందోళన..

    • ఈనెల 6 వరకు బుక్ చేసిన వారికి సిలిండర్లు ఇస్తున్నామన్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు..

  • Mar 13, 2026 12:43 IST

    ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

    • రూ.47కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం..

    • ఇద్దరి అరెస్ట్, 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల కెమికల్స్ సీజ్..

    • ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో DRI తనిఖీలు..

    • కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా..

  • Mar 13, 2026 12:42 IST

    భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

    • సెన్సెక్స్ 1,180, నిఫ్టీ 400 పాయింట్లకుపైగా నష్టం..

    • డాలర్‌తో పోలిస్తే 92.47కి చేరిన రూపాయి మారకం విలువ ..

  • Mar 13, 2026 12:41 IST

    ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

    • పిచ్చిగా ప్రవర్తిస్తే.. ఏం జరుగుతుందో మీరే చూస్తారు: ట్రంప్

    • ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది: ట్రంప్

    • ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు: ట్రంప్

  • Mar 13, 2026 12:24 IST

    ఎన్టీఆర్‌: దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాల ఘటనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

    • ఆహార నాణ్యత తక్కువగా ఉందన్న సమాచారంతో చర్యలు: మంత్రి లోకేశ్

    • విచారణకు త్రిసభ్య కమిటీ..

    • కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు..

    • ఏజెన్సీని మార్చడంతో పాటూ హెడ్మాస్టర్‌పై వేటు..

    పూర్తి కథనం..

  • Mar 13, 2026 12:22 IST

    హైదరాబాద్‌: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

    • హాజరైన సీఎస్‌, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు..

    • గ్యాస్, ఆయిల్‌ కంపెనీలు, లీగల్ మెట్రలాజీ అధికారులతో సమావేశం..

    • గ్యాస్ నిల్వలు, అంతర్జాతీయ పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమీక్ష..

    • ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

  • Mar 13, 2026 11:02 IST

    ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ కాంక్రీట్ లోడ్ లారీ

    • విశాఖ: గాజువాకలోని వడ్లపూడి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కాంక్రీట్ లోడ్ లారీ..

    • ప్రమాదంలో దెబ్బతిన్న లారీ ముందు భాగం..

    • లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు..

    • ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

  • Mar 13, 2026 10:56 IST

    కొమురంభీం జిల్లా: పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు

    • అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల బారులు..

    • కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం..

    • పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్న అధికారులు..

  • Mar 13, 2026 10:50 IST

    పసిడి ప్రియులకు శుభవార్త.. పతనమైన బంగారం ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.980 పతనమై రూ.1,61,240కి చేరిన బంగారం

    • 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.900 తగ్గి రూ.1,47,800కి చేరిన పసిడి

    • కిలోకు రూ.100 తగ్గి రూ.2,79,900గా ట్రేడ్ అవుతున్న వెండి

  • Mar 13, 2026 10:22 IST

    గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం: ABNతో మంత్రి పొన్నం

    • కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య..

    • గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • Mar 13, 2026 10:21 IST

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం

    • జస్టిస్‌ లిసా గిల్‌తో ప్రమాణం చేయించిన CJ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌..

    • ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌..

  • Mar 13, 2026 09:55 IST

    శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు మరో గుడ్ న్యూస్..

    • నేడు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స..

    • హేమ శ్రీ అనే యువతికి శస్త్ర చికిత్స చేయనున్న నిపుణులు..

    • కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు ఇప్పటికే రూ.12 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం..

    • మొదటి శస్త్ర చికిత్స కోసం పలాసకు రానున్న వైద్య నిపుణులు..

    పూర్తి కథనం..

  • Mar 13, 2026 09:38 IST

    భక్తుల పైకి దూసుకెళ్లిన బొలెరో.. 15 మందికి గాయాలు..

    • నంద్యాల: శ్రీశైలం టోల్‌గేట్ దిగువన చోటుచేసుకున్న ఘటన..

    • అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లిన బొలెరో..

    • 15 మంది కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు..

  • Mar 13, 2026 08:53 IST

    నేడు రాష్ట్ర పండుగగా కవయిత్రి మొల్లమాంబ జయంతి

    • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొల్ల జయంతి ఉత్సవం..

    • మొల్ల జయంతి ఉత్సవంలో పాల్గొననున్న మంత్రి సవిత..

  • Mar 13, 2026 08:39 IST

    బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • కారును ఢీకొన్న కర్ణాటక బస్సు..

    • కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అనురాగ్, ఐశ్వర్య దంపతుల మృతి..

    • బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న దంపతులు..

    • కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఘటన..

    పూర్తి కథనం..

  • Mar 13, 2026 08:10 IST

    శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు..

    • తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ ప్రముఖులు..

    • శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న సంగీత దర్శకుడు తమన్‌, డైరెక్టర్ బాబీ, నిర్మాత లోహిత్‌ తదితరులు..

  • Mar 13, 2026 08:06 IST

    నంద్యాల: నల్లమల అడవిలో కార్చిచ్చు

    • మహానంది క్షేత్రం వెనుక ఎగిసిపడుతున్న మంటలు..

    • ​వన్యప్రాణుల మనుగడకు పొంచి ఉన్న ముప్పు..

    • రక్షణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖను కోరుతున్న స్థానికులు..

    • ​ఎండాకాలం ప్రారంభంతో అడవిలో వ్యాపిస్తున్న మంటలు..

  • Mar 13, 2026 07:34 IST

    నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • టూరిస్ట్ బస్సు బోల్తా, నలుగురి మృతి, పలువురికి గాయాలు..

    • హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బస్సు..

    • ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు..

  • Mar 13, 2026 07:32 IST

    స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 పతనమై రూ.1,62,210కి చేరిన బంగారం

    • 22 క్యారెట్ల 10 గ్రాములపైనా అదే స్థాయిలో తగ్గి రూ.1,48,690కి చేరిన పసిడి

    • కిలోకు రూ.100 తగ్గి రూ.2,79,900గా ట్రేడ్ అవుతున్న వెండి

    పూర్తి కథనం..

  • Mar 13, 2026 06:58 IST

    మళ్లీ 100 డాలర్లకు చేరుకున్న చమురు ధర

    • హోర్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా ఆగిపోవడంతో..

    • మళ్లీ భారీగా పెరిగిన బ్యారెల్‌ క్రూడాయిల్ ధర

  • Mar 13, 2026 06:58 IST

    దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం

    • వరుసగా రెండో నెలలోనూ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు..

    • ఫిబ్రవరిలో దేశంలో 3.21 శాతం ద్రవ్యోల్బణం..

    • తెలంగాణలో 5.2 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు..

  • Mar 13, 2026 06:57 IST

    నేటి నుంచి చర్లపల్లి-కామాఖ్య అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

    • శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, రాజమండ్రి, భీమవరం..

    • విజయవాడ, గుంటూరు, నల్లగొండలో ఆగనున్న అమృత్‌భారత్‌..

  • Mar 13, 2026 06:56 IST

    తెలంగాణ రవాణా శాఖలో నేటి నుంచి కొత్త విధానం

    • ఆన్‌లైన్‌లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లు..

    • ఇకపై డాక్యుమెంట్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌..