Share News

గుర్రంగూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:09 PM

హైదరాబాద్ శివారులో ఉన్న గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమంగల్ డివిజన్ పరిధిలో 424 ఎకరాలు 31 గుంటల్లో ఉన్న అటవీ భూమికి రిజర్వ్ ఫారెస్ట్ హోదా కల్పించింది

గుర్రంగూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు
Gurranguda reserve forest

హైదరాబాద్, మార్చి13: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలంలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమంగల్ డివిజన్ పరిధిలో 424 ఎకరాలు 31 గుంటల్లో ఉన్న అటవీ భూమికి రిజర్వ్ ఫారెస్ట్ హోదా కల్పించింది. సెక్షన్ 15 ప్రకారం జీవో నెం.7 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


కొన్నేళ్లుగా న్యాయ వివాదాల్లో ఉన్న సాహెబ్‌నగర్ కలాన్ భూములపై ప్రభుత్వ హక్కులకు బలం చేకూరింది. సుప్రీంకోర్టు తీర్పుతో అటవీ శాఖ వాదనకు మద్దతు లభించింది. ఆక్రమణలు, అనధికార హక్కుల నుంచి అటవీ భూములకు రక్షణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గుర్రంగూడలో భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో గ్రీన్ లంగ్ స్పేస్‌ల విస్తరణకు కీలక నిర్ణయం తీసుకుంది.


భాగ్యనగర ప్రజలకు ప్రకృతి మధ్య విశ్రాంతి కోసం, అలానే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అటవీ భూముల సంరక్షణ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ శివార్లలోని గుర్రం గూడలోని 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖకు చెందినదేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి:

మాజీ డీజీపీ మృతి.. సంతాపం తెలిపిన సీఎం

సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సినిమా నిర్మాతలకు ఊరట

Updated Date - Mar 13 , 2026 | 05:16 PM