Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:03 AM

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి
Ballari Road Accident

కర్నూలు, అన్నమయ్య జిల్లా మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


బళ్లారిలో..

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Ballari Road Accident) జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. బళ్లారి సమీపంలో మృతుల కారును కర్ణాటకకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆదోనికి చెందిన అనురాగ్, ఐశ్వర్య దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. అనురాగ్, ఐశ్వర్య దంపతులు కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలియడంతో బళ్లారి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


అన్నమయ్య జిల్లాలో..

అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే గొడ్డావుల కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. బొలెరో వాహనం కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. అనంతపురం నుంచి మదనపల్లికి కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 09:29 AM