ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:36 PM
టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. కప్ గెలవడంపై స్పందించాడు. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి ఈ పొట్టి ప్రపంచ కప్‌ను టీమిండియా సగర్వంగా ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. కప్ గెలవడంపై స్పందించాడు. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘డియర్ టీమిండియా ఫ్యాన్స్.. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మద్దతు, దీవెనల వల్లే కప్పు సాధించగలిగాం. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు.. యావత్ భారత దేశ విజయం. ఈ కప్పు.. చేతిలో బ్యాట్, బాల్ పట్టుకుని భవిష్యత్తును ఊహించుకుంటూ కలలు కంటున్న చిన్నారులది. ఈ విజయం స్టేడియాల్లో పోటెత్తిన అభిమానులది. ఈ విజయం మాకు మద్దతు తెలిపిన ఫ్యాన్స్ అందరిదీ. మీ ప్రేమ, ప్రార్థనలు ఈ కప్పును తిరిగి గెలిచే శక్తిని మాకు ప్రసాదించాయి. ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు.. అదో ఎమోషన్. ఈ విజయం మీ అందరికీ చెందుతుంది’ అని సూర్య అన్నాడు.
మాది ఒకటే ప్రణాళిక..
‘మీరు గమనిస్తే.. సెమీ ఫైనల్స్ వరకు అత్యధిక పరుగులు చేసిన, ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో భారత క్రికెటర్లు ఎవరూ లేరు. అయినా మేం విజయం సాధించాం. ఇదంతా జట్టుగా ఆడటం వల్లే సాధ్యం అయింది. గత 18 నెలలుగా మేం ఈ దృక్పథంతోనే ముందుకు సాగుతున్నాం. అయితే ప్రపంచ కప్ గెలిచేశాం.. ఇక విశ్రాంతి తీసుకుంటామని చెప్పే ప్రసక్తే లేదు. మా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే. అలాగే అదే సంవత్సరంలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లోనూ విజేతగా నిలవడమే టీమిండియా లక్ష్యం. హ్యాట్రిక్ విజయాలు సాధిస్తే.. ఆ మజానే వేరు కదా’ అని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్