కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:01 PM
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. గత సీజన్‌లో 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. రెండోసారి ఆర్సీబీ టైటిల్‌ను సొంతం చేసుకోవడం కోసం.. ప్లేయర్లందరూ ధాటిగా ఆడుతారని ఇర్ఫాన్ అన్నాడు.
‘విరాట్ కోహ్లీలో పరుగుల దాహం అలాగే ఉంది. నిజానికి అది గతంలో కంటే మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గత సీజన్‌లో విజేతగా నిలిచిన తర్వాత అది మరింత పెరిగింది. అతడు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకోవాలని తపిస్తున్నాడు. మరోవైపు విరాట్.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించాడు. ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ అతడు అదే దృక్పథంతో బరిలోకి దిగి, ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. విరాట్.. మరోసారి ఆర్సీబీకి ట్రోఫీని అందించాలనుకుంటున్నాడు’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అతడే..
సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతాపై సస్పెన్షన్.. ఎందుకంటే..