Share News

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:52 AM

'ది హండ్రెడ్ లీగ్' ఫ్రాంచైజీల్లో ఒక్కటైన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఎక్స్ ఖాతా సస్పెన్సన్‌కు గురైంది. అయితే దీనికి గల కారణాల గురించి ఎక్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్‌ సస్పెండెడ్‌. ఎక్స్‌ సస్పెండ్స్‌ అకౌంట్స్‌ దట్‌ వయోలేట్‌ ది ఎక్స్‌ రూల్స్‌’ అని పాప్‌ అప్‌ మెసేజ్‌ కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..
Sunrisers Leeds

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ 'ది హండ్రెడ్ లీగ్'(The Hundred League)లో పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు సన్‌రైజర్స్‌ లీడ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెటోరి పాల్గొన్నారు. దీంతో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్ కు గురైంది.


సన్‌రైజర్స్‌ లీడ్స్(Sunrisers Leeds) ఎక్స్ ఖాతా సస్పెన్షన్‌ కావడానికి గల కారణాల గురించి ఎక్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్‌ సస్పెండెడ్‌. ఎక్స్‌ సస్పెండ్స్‌ అకౌంట్స్‌ దట్‌ వయోలేట్‌ ది ఎక్స్‌ రూల్స్‌’ అని పాప్‌ అప్‌ మెసేజ్‌ దర్శనమిస్తుంది. మరోవైపు 2009లో ఐపీఎల్‌‌ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధించిన తర్వాత, ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యం పాకిస్థాన్ ప్లేయర్‌తో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో అబ్రార్ అహ్మద్ భారత్‌ను అవమానిస్తూ పోస్టులు చేశాడని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.


అలాంటి ఆటగాడిని కొనుగోలు చేయడంపై కావ్యా మారన్‌ను, సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మంది యూజర్లు రిపోర్ట్ చేయడంతోనే ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయి ఉంటుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరం నార్తర్న్ సూపర్‌ ఛార్జర్స్‌గా ‘ది హండ్రెడ్‌’ బరిలో దిగిన లీడ్స్ జట్టును సన్ టీవీ నెట్‌వర్క్(Sun Tv Network) పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి 49 శాతం వాటా, మిగిలిన 51 శాతం వాటాను యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి కొనుగోలు చేసింది.


ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం

Updated Date - Mar 13 , 2026 | 12:53 PM