Share News

బాహుబలితో ఉత్తేజితులయ్యాం

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:16 AM

టీ20 మెగా టోర్నీలో వరుస విజయాలతో బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిన టీమిండియాకు సూపర్‌-8లో ఝలక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టయ్యింది. అటు అభిమానులకు కూడా...

బాహుబలితో ఉత్తేజితులయ్యాం

అక్షర్‌ను క్షమాపణ కోరా..

ఆ రాత్రి నిద్రపోలేదు

టీ20 వరల్డ్‌కప్‌పై కెప్టెన్‌ సూర్యకుమార్‌

టీ20 మెగా టోర్నీలో వరుస విజయాలతో బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిన టీమిండియాకు సూపర్‌-8లో ఝలక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టయ్యింది. అటు అభిమానులకు కూడా మన క్రికెటర్లపై అపనమ్మకం ఏర్పడింది. ఈ స్థితి నుంచి తిరిగి చాంపియన్‌గా మారేందుకు బాహుబలి, కేసరి సినిమాల్లో పాటలు ఉత్తేజాన్ని నింపాయట. అంతేకాదు అదే మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ అక్షర్‌ను పక్కనబెట్టాలనే నిర్ణయం కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. వీటన్నింటి గురించి కప్‌ గెలిచిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ చెప్పి సంగతులివీ..

బ్యాటర్లకు బాహుబలి.. బౌలర్లకు ‘ఓ షేరా తీర్‌ తే తాజ్‌’

దక్షిణాఫ్రికాతో ఓటమి మాకు కనువిప్పు లాంటిది. అందుకే మరింత శ్రద్ధగా, ప్రత్యేకంగా సన్నద్ధం కావాలనుకున్నాం. ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ కూడా ప్రాక్టీ్‌సలో బెస్ట్‌ ఫీల్డర్‌కు రూ.10 వేలు ఇచ్చి ప్రోత్సహించాడు. ఇక వీడియో అనలిస్ట్‌ గత రెండేళ్ల మా ప్రదర్శనకు సంబంధించిన వీడియోను రూపొందించారు. ఇందులో బ్యా టర్ల కోసం బాహుబలి సాంగ్‌.. బౌలర్ల కోసం కేసరి మూవీలోని ‘ఓ షేరా తీర్‌ తే తాజ్‌’ పాటతో స్ఫూర్తి నింపారు.

66-Sports.jpg

అక్షర్‌కు సారీ చెప్పా..: సూపర్‌-8 ఆరంభ మ్యాచ్‌లో అక్షర్‌ను బెంచ్‌పైనే ఉం చాం. ఆ నిర్ణయం పటేల్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తను జట్టు వైస్‌కెప్టెన్‌ కూడా. దక్షిణాఫ్రికాపై తను లేకపోవడం దెబ్బతీసిం ది. అందుకే మ్యాచ్‌ ముగిశాక పొరపాటు చే శాం.. క్షమించమని అక్షర్‌ను కోరాను. తను కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాతి రోజు మేమంతా మామూలుగానే మాట్లాడుకున్నాం.

సంజూ ఇన్నింగ్స్‌ మలుపు తిప్పాయి: శాంసన్‌ అత్యంత కీలక మ్యాచ్‌ల్లో 97, 89, 89 స్కోర్లు సాధించాడు. తల్చుకుంటే వీటిని శతకాలుగా మార్చుకునే అవకాశం అతడికి ఉంది. కానీ అందుకు మరో 10 బంతులు ఎదుర్కొని ఐదారు పరుగులు చేస్తే ఇంకో బ్యాటర్‌ నుంచి నాలుగు బంతులు లాక్కున్నట్టే. దూబే ఆరు బంతుల్లోనే 28 రన్స్‌, 8 బంతుల్లో 26 రన్స్‌ బాదాడు. అందుకే శాంసన్‌ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడాలనుకోలేదు. వరుసగా జట్టు 250 స్కోర్లు సాధించడానికి కూడా ఆ దూకుడే కారణం.

గంభీర్‌ను నవ్వించగలిగాం..: టోర్నీలో మొదటి 4 మ్యాచ్‌ల ద్వారా కోచ్‌ గంభీర్‌కు నవ్వే అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత మా ప్రదర్శనపై తను సంతృప్తిగా ఉన్నట్టు కనిపించింది. ఇక ఫైనల్‌ ముగిశాక గౌతీ తనివితీరా నవ్వుకునే ఉంటాడు.


అభిషేక్‌కు గ్యారెంటీ ఇచ్చా..: అభిషేక్‌పై మేం పూర్తి నమ్మకముంచాం. తను ఓ 8 ఓవర్లు బ్యాటింగ్‌ చేశాడంటే మ్యాచ్‌ను ము గించినట్టే. అందుకే ఓ సందర్భంలో అతడికి చెప్పాను.. వరల్డ్‌క్‌పలోని 9 గేమ్‌ల్లో ఎనిమిదింట్లో నువ్వు డకౌట్లు అయినా.. ఫైనల్లో తొలి బంతిని నువ్వే ఎదుర్కొంటావనే భరోసానిచ్చా. అదే జరిగింది. కివీ్‌సపై 18 బంతుల్లోనే 50 బాదడమే కాకుండా పవర్‌ప్లేలోనే జట్టు 90 రన్స్‌ సాధించింది. అక్కడి నుంచి మ్యాచ్‌ స్వరూపమే మారింది. అందుకే అలాంటి ఆటగాళ్లకు మద్దతివ్వడం ముఖ్యం.

ఆ రాత్రి నిద్రపోలేదు: చాంపియన్‌గా నిలిచాక మేమంతా మా కుటుంబ సభ్యులతో కలిసి మైదానంలోనే రాత్రి 2 వరకున్నాం. హోటల్‌కు చేరుకున్నాక కూడా నిద్రపోలేదు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఉదయం ఏడు గంటల వరకు మేలుకొనే ఉన్నారు.

వై నాట్‌ హ్యాట్రిక్‌: అంచనాలకు తగ్గట్టుగానే మా జట్టు వరుసగా రెండు టీ20 వరల్డ్‌క్‌పలను గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించేందుకు కృషి చేస్తాం. వై నాట్‌ హ్యాట్రిక్‌? అంతేకాదు ఒలింపిక్స్‌లోనూ విజయం సాధించాలనుకుంటున్నాం.

ఇవి కూడా చదవండి:

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 13 , 2026 | 03:18 AM