Share News

సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:31 PM

విదేశీ లీగ్ ‘ది హండ్రెడ్’ వేలంలో భాగంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు రూ.2.34 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ వివాదంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు.

సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
BCCI

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ లీగ్ ‘ది హండ్రెడ్’ వేలంలో భాగంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు రూ.2.34 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ ఇండియన్ ఫ్రాంచైజీ పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. దీంతో ఐపీఎల్ 2026లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ వివాదంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘ఇది ఐపీఎల్‌కు సంబంధించిన విషయం కాదు. విదేశీ లీగ్‌లో జరిగిన వ్యవహారం. అందువల్ల ఈ అంశంపై బీసీసీఐ జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆ ఫ్రాంచైజీదే తుది నిర్ణయం’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో అబ్రార్ భారత సైన్యాన్ని విమర్శిస్తూ మైదానంలోనే చెలరేగిన విషయం తెలిసిందే. అలాంటి ఓ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.


భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో 2008 తర్వాత ఇప్పటి వరకు ఏ పాకిస్థాన్ అంతర్జాతీయ ఆటగాడు ఐపీఎల్ టోర్నీలో ఆడలేదు. అయితే ప్రపంచంలోని ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం ఐపీఎల్ యాజమాన్యంలోని జట్లు పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కెప్టెన్ అతడే..

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

Updated Date - Mar 13 , 2026 | 03:14 PM