ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అతడే..
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:54 AM
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి.
స్పోర్డ్స్ డెస్క్: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. గత సీజన్ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్ల మార్పు ఉంటుందని క్రీడా వర్గాలు భావించాయి. ముఖ్యంగా కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ల మార్పు తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ సీజన్‌లోనూ గతంలో ఉన్న కెప్టెన్లతోనే ముందుకు వెళ్లాలని ఆ రెండు ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీకి అక్షర్ పటేల్, కేకేఆర్ అజింక్య రహానేను ఈ సీజన్‌లో కూడా కెప్టెన్లుగా కొనసాగనున్నారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కేకేఆర్ కెప్టెన్ రహానే విషయానికి వస్తే.. గత సీజన్ లో ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడి మార్పు తప్పదని అంతా భావించారు. ఈ ప్రస్తావన రాగానే జట్టులో సీనియర్లలో ఒకరైన వరుణ్ చక్రవర్తి కెప్టెన్సీపై ఆశలు పెంచుకున్నాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడ్డారు. తీరా చూస్తే యాజమాన్యం రహానేతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2026 సీజన్‌కు ముందు కేకేఆర్ యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా చాలా మంది సీనియర్లను వదిలించుకొని కొత్త వారిని జట్టులోకి చేర్చుకుంది. కేకేఆర్ వదిలించుకున్న సీనియర్లలో ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, అన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు సాగే ఈ విడతతో 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించారు. ఈ దశలో ప్రతి జట్టు తలో 4 మ్యాచ్‌లు ఆడనుంది.
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది. మార్చి 29న కేకేఆర్ తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా 29వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతాపై సస్పెన్షన్.. ఎందుకంటే..
సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం