Share News

నా కోసం వరల్డ్ కప్2026 గెలుస్తావా?.. ఇషాన్‌కు సూర్య ఫోన్ కాల్..

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:02 PM

సొంతగడ్డపై టీ20 ప్రపంచ కప్2026ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 8న న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నా కోసం వరల్డ్ కప్2026 గెలుస్తావా?.. ఇషాన్‌కు సూర్య ఫోన్ కాల్..
Suryakumar Yadav interview ICC

స్పోర్ట్స్ డెస్క్: సొంతగడ్డపై టీ20 ప్రపంచ కప్2026ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 8న న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండో సారి టైటిల్ సాధించిన జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాక మూడు సార్లు పొట్టి కప్పును అందుకున్న తొలి జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోర్నీకి సంబంధించిన పలు అంశాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో టోర్నీకి ముందు ఇషాన్ కిషన్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ గురించి ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.


ఇషాన్ కిషన్ రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఈ టోర్నీలోని తొమ్మిది మ్యాచ్‌ల్లో 317 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌కు ముందు ఇషాన్ కిషన్‌తో జరిగిన సంభాషణ గురించి సూర్య మాట్లాడుతూ..'టోర్నమెంట్‌కు ముందు, మేము జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ ఓ విషయం గుర్తుంది. నేను ఇషాన్ కిషన్ కి ఫోన్ చేసాను, 'నువ్వు నా కోసం ప్రపంచ కప్ గెలుస్తావా?' అని అడిగాను. కొంచెం నమ్మకం చూపించు, నేను చేస్తాను అని ఇషాన్ చెప్పాడు' అని సూర్య అన్నాడు.


'ఇషాన్ కిషన్‌ను మేము ప్రపంచ కప్2026 టోర్నీ జట్టుకు ఎంపిక చేసినందుకు, అతడు న్యాయం చేశాడు. ఎక్కడా మమ్మల్ని అతను నిరాశపరచలేదు. గత రెండేళ్లలో అతను చాలా అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచులను కోల్పోయాడు. కానీ, అతను దేశీయ క్రికెట్‌కు తిరిగి వెళ్ళాడు. అక్కడ తన పాత్రను పోషించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి.. తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో తన సామర్థ్యం మేరకు జట్టు కోసం కృషి చేశాడు' అని ఐసీసీ ఇంటర్వ్యూలో సూర్య చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కెప్టెన్ అతడే..

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

Updated Date - Mar 13 , 2026 | 01:03 PM