Share News

భర్తను పకోడీ తీసుకురమ్మని పంపి పరారైన భార్య..

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:40 PM

పకోడీ తీసుకుని తిరిగి ఆమె ఉన్న చోటకు వచ్చాడు. కానీ, అక్కడ తన భార్య కనిపించలేదు. అక్కడే చుట్టుపక్కల ఉంటుందని భావించి బస్టాండ్ మొత్తం వెతికాడు. కానీ, ఎక్కడా కనిపించలేదు. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? సదరు వ్యక్తి భార్య ఎక్కడికి వెళ్లింది? పకోడీ తెమ్మని చెప్పి..

భర్తను పకోడీ తీసుకురమ్మని పంపి పరారైన భార్య..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలిద్దరూ తమ ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌‌కు వెళ్లారు. అక్కడ బస్ కోసం ఎదురు చూస్తుండగా భార్యకు ఆకలేసింది. వెంటనే ‘ఏవండీ అక్కడ వేడి వేడి పకోడీలు ఉన్నాయి. తీసుకువస్తారా.. ఆకలిగా ఉంది’ అంటూ అడిగింది. భార్య అలా అడగడమే ఆలస్యం.. భర్త పకోడీ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. పకోడీ తీసుకుని తిరిగి ఆమె ఉన్న చోటకు వచ్చాడు. కానీ, అక్కడ తన భార్య కనిపించలేదు. అక్కడే చుట్టుపక్కల ఉంటుందని భావించి బస్టాండ్ మొత్తం వెతికాడు. కానీ, ఎక్కడా కనిపించలేదు. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? సదరు వ్యక్తి భార్య ఎక్కడికి వెళ్లింది? పకోడీ తెమ్మని చెప్పి ఎందుకు పరారైంది? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..


ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్.. రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్(18)ను గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా రింజిమ్ తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. పండుగ ముగిసిన తరువాత ప్రీతమ్ తన భార్య రింజిమ్‌ను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు అత్తగారింటికి వెళ్లాడు. మార్చి 9న అత్తగారింటికి వెళ్లిన ప్రీతమ్.. తన భార్యను తీసుకుని బస్టాండ్‌కు వచ్చాడు. ఇద్దరూ బిలారి బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రింజిమ్ తనకు ఆకలిగా ఉందని, తినడానికి పకోడీ తీసుకురమ్మని భర్తను కోరింది. దీంతో అతను పకోడీ కొనితెచ్చేందుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రింజిమ్.. బస్టాండ్ నుంచి పరారైంది. మరోవైపు ప్రీతమ్ పకోడీ తీసుకుని బస్టాండ్‌లోకి వచ్చాడు. కానీ, అక్కడ రింజిమ్ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాలన్నీ వెతికాడు. కానీ, ఆమె ఎక్కడా కనిపించలేదు.


ఏదో తేడాగా ఉందని అనుమానించిన ప్రీతమ్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు.. తన భార్య ఓ యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రీతమ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేశారు. ఆమె కదలికలను ట్రాక్ చేయడానికి ఆమె మొబైల్ లొకేషన్‌ను కూడా ట్రేస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆచూకీ లభించలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Also Read:

ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్

రైలు చివరి బోగీపై 'X' గుర్తు ఎందుకు ఉంటుంది? మీకు తెలుసా?

IRCTC స్పెషల్ ఆఫర్.. మైసూర్ నుంచి కోయంబత్తూర్ వరకు అద్భుతమైన ప్రయాణం

Updated Date - Mar 13 , 2026 | 03:42 PM