Share News

రైలు చివరి బోగీపై 'X' గుర్తు ఎందుకు ఉంటుంది? మీకు తెలుసా?

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:19 PM

భారత దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరతో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు ఉండటం వల్ల చాలా మంది రైలు ప్రయాణాలవైపు మొగ్గు చూపుతుంటారు. రైలు చివరన ఉన్న బోగీ వెనుక వైపున 'X', 'LV' గుర్తులు కనిపిస్తుంటాయి. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. వివరాల్లోకి వెళితే..

రైలు చివరి బోగీపై 'X' గుర్తు ఎందుకు ఉంటుంది? మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరతో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు ఉండటం వల్ల చాలా మంది రైలు ప్రయాణాలవైపు మొగ్గు చూపుతుంటారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇరువైపులా కొన్ని రకాల బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది, రైలు చివరి బోగీ వెనుక ఉండే పెద్ద 'X' గుర్తు. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన భద్రతా కారణం దాగి ఉంది.


రైలు వెనుక బోగిపై ఉండే తెల్లటి లేదా పసుపు రంగు 'X' గుర్తు, రైలు ప్రయాణం పూర్తయిందని సూచిస్తుంది. అంటే, ఇంజిన్‌కు తగిలించిన అన్ని బోగీలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని, మధ్యలో ఏ బోగీ విడిపోలేదని ఇది ధృవీకరిస్తుంది. రైలు ఒక స్టేషన్ దాటి వెళ్తున్నప్పుడు, స్టేషన్ మాస్టర్ ఆ రైలు చివరి బోగీని తప్పనిసరి గమనిస్తారు. అక్కడ 'X' గుర్తు కనిపిస్తేనే, ఆ ట్రాక్ ఖాళీగా ఉందని, తదుపరి రైలును పంపవచ్చని వారు నిర్ధారించుకుంటారు. ఒకవేళ రైలు వెనుక ఈ గుర్తు లేకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే అప్రమత్తమవుతారు. చివరి బోగీ ట్రైన్ నుంచి విడిపోయి దార్లో ఎక్కడో ఆగి ఉంటుందని అంచనా వేస్తారు. వెంటనే రైలు ఆపి పై అధికారులకు సమాచారం అందివ్వడమే కాకుండా మళ్లీ పరిస్థితిని చక్కదిద్దే వరకు రైలును ముందుకు కదలనివ్వరు. అదే పట్టాలపై వెనుక నుంచి వచ్చే ఇతర రైళ్లను నిలిపి వేస్తారు.


పగటి పూట 'X' గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది, కానీ రాత్రి వేళల్లో ఇది కనిపించదు. అందుకే భద్రత కోసం రైలు వెనుక భాగంలో రెడ్ లైట్ నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఇది కూడా రైలు సురక్షితంగా దాటిపోయిందని చెప్పే సంకేతమే. 'X' గుర్తుతో పాటు, మీరు ఒక చిన్న బోర్డుపై 'LV' అని రాసి ఉండటం గమనించవచ్చు. దీని అర్థం లాస్ట్ వెహికల్(Last Vehicle), అంటే ఆ రైలుకు అది చివరి బోగీ అని అర్థం. మనకు చిన్న గుర్తులుగా కనిపించే ఈ సంకేతాలు, లక్షలాది మంది ప్రయాణికుల భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి.


ఇవీ చదవండి:

'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్

Updated Date - Mar 13 , 2026 | 05:21 PM