Share News

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:05 PM

గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!
Kakinada Tiger Alert

కాకినాడ, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండల పరిధిలోని గౌరవంపేట పంచాయతీ, రాజవరం - మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటల్లో పెద్దపులి కదలికలను గుర్తించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.


ప్రస్తుతం ఈ పెద్దపులి మెడలో జీపీఎస్ రెడియో కాలర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని సాయంతో పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న అధికారులు, పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెద్దపులి ఎటువైపు వెళ్తోంది? ఎక్కడ ఆగుతోంది? అనే అంశాలను గమనించడానికి డ్రోన్లను, అత్యాధునిక కెమెరా ట్రాప్‌లను రంగంలోకి దించారు. పెద్దపులి సంచరిస్తున్న మార్గాల్లో ఇప్పటికే ఇనుప ట్రాక్ కేజ్‌లను(బోన్లను) అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పలిని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించే అవకాం ఉంది. రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి.


నాగార్జునసార్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి నిపుణులైన బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన అవకాశం ఉంది. అవసరమైతే పశు వైద్యుల పర్యవేక్షణలో ట్రాంక్విలైజర్ గన్‌తో మత్తుమందు ఇచ్చి పులిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. శంఖవరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా తోటల్లో పనులు చేసేవారు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు, తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.


Also Read:

ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

For More Latest News

Updated Date - Mar 13 , 2026 | 05:23 PM