Share News

గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 07:11 AM

నేటి మార్కెట్లో బంగారం రేట్లు స్వల్పంగా పతనమయ్యాయి. నేటి ఉదయం 7:00 గంటల సమయానికి మార్కెట్లో పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...

గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు
Gold Rates

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతలతో కొద్దిరోజుల క్రితం ఈ రేట్లలో స్థిరమైన పెరుగుదల నమోదవ్వగా.. నేడు స్వల్పంగా దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 7:00 గంటల సమయంలో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.10 మేర పతనమై రూ.1,62,210కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాములపై కూడా అదే స్థాయిలో తగ్గి ప్రస్తుతం రూ.1,48,690 వద్ద ట్రేడవుతోంది(Gold Rates Today).

ఇక వెండి విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది(Silver Rates Today).


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధరలు ఇలా..

  • హైదరాబాద్: ₹1,62,210; ₹1,48,690

  • విజయవాడ: ₹1,62,210; ₹1,48,690

  • ఢిల్లీ: ₹1,62,360; ₹1,48,840

  • ముంబై: ₹1,62,210; ₹1,48,690

  • కోల్‌కతా: ₹1,62,210; ₹1,48,690

  • చెన్నై: ₹1,63,300; ₹1,49,690

  • బెంగళూరు: ₹1,62,210; ₹1,48,690

  • కేరళం: ₹1,62,210; ₹1,48,690

  • పుణే: ₹1,62,210; ₹1,48,690


వెండి రేట్లు(కిలోకు) ఇలా..

  • హైదరాబాద్: ₹2,89,900

  • విజయవాడ: ₹2,89,900

  • ఢిల్లీ: ₹2,79,900

  • ముంబై: ₹2,79,900

  • కోల్‌కతా: ₹2,79,900

  • చెన్నై: ₹2,89,900

  • బెంగళూరు: ₹2,79,900

  • కేరళం: ₹2,89,900

  • పుణే: ₹2,79,900


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే అందించడమైనది. బంగారం ధరలు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నగరం, మేకర్/జ్యువెలర్ ఆధారంగా రేట్లలో స్వల్ప తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాలని సూచించడమైనది.


ఇవీ చదవండి:

రూ.23.44 లక్షల కోట్లు యుద్ధార్పణం

మరణించిన ఇన్వెస్టర్ల వారసులకు సులభతర క్లెయిమ్‌ ప్రక్రియ

Updated Date - Mar 13 , 2026 | 07:15 AM