Share News

రూ.23.44 లక్షల కోట్లు యుద్ధార్పణం

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:40 AM

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి భారత స్టాక్‌ మార్కెట్లు భారీ గా నష్టపోయాయి. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 5,252.77 పాయింట్లు (6.46 శాతం) క్షీణించింది...

రూ.23.44 లక్షల కోట్లు యుద్ధార్పణం

  • పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్కెట్‌ కోల్పోయిన సంపద ఇది..

  • బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 5,253 పాయింట్లు పతనం

ముంబై: ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి భారత స్టాక్‌ మార్కెట్లు భారీ గా నష్టపోయాయి. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్‌ 5,252.77 పాయింట్లు (6.46 శాతం) క్షీణించింది. ఈక్విటీ ఇన్వెస్టర్ల వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా రూ.23,44,237.26 లక్షల కోట్లు తగ్గి రూ.440.06 లక్షల కోట్లకు (4.77 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

చమురు చుర్రు.. సూచీలు గింగిరాలు

పశ్చిమాసియాలో సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతుండటంతో ముడిచమురు మళ్లీ 100 డాలర్లకు ఎగబాకింది. క్రూడ్‌ సెగకు దేశీయ ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ కుప్పకూలాయి. సెన్సెక్స్‌ గురువారం ఒక దశ లో 992.53 పాయింట్లు పతనమై 75,871.18 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.70 పాయింట్లు కోల్పోయి 23,693.15 వద్దకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టపోగా.. ఎం అండ్‌ ఎం 4.23 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. మారుతి సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు 3 శాతానికి పైగా తగ్గాయి.


రూపాయి కొత్త కనిష్ఠానికి..

ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఒక దశలో 35 పైసలు క్షీణించి రూ.92.36 వద్ద సరికొత్త జీవితకాల ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి డాలర్‌తో రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 16 పైసల నష్టంతో రూ.92.17 వద్ద ముగిసింది. ముడిచమురు ధరలు ఎగబాకుతుండటం, డాలర్‌ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లో నష్టాల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి.

వెండి అప్‌.. బంగారం డౌన్‌

ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,500 పెరుగుదలతో రూ.2,76,500కు చేరుకోగా.. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.400 తగ్గి రూ.1,65,200 కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) సిల్వర్‌ 1.47 శాతం పెరిగి 86.99 డాలర్లకు చేరగా.. గోల్డ్‌ 5,178 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:40 AM