ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..
ABN , Publish Date - Mar 12 , 2026 | 07:20 AM
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. అమెరికా-దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తరకొరియా మంగళవారం ఈ ప్రయోగాలు చేసింది. ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది.
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. అమెరికా-దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తరకొరియా మంగళవారం ఈ ప్రయోగాలు చేసింది. ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఉత్తరకొరియా ఈ తరహా ప్రయోగాలు చేపట్టడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం (North Korea missile launch).
ఆ ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన 13 ఏళ్ల కూతురు కిమ్ జు యేతో కలిసి వీక్షించారు (Kim Jong Un missile test). ఉత్తర కొరియా ప్రధాన విధ్వంసక నౌక 'చో హ్యోన్' నుంచి ఒకేసారి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించామని, అవి పశ్చిమ తీరంలో బహుళ ద్వీప లక్ష్యాలను ఢీకొట్టామని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తరకొరియాపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించేందుకే ఈ శక్తివంతమైన క్షిపణులతో ప్రయోగాలు జరిపామని కిమ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
షేర్ మార్కెట్ పేరిట రూ.27లక్షల సైబర్ మోసం
స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..