షేర్ మార్కెట్ పేరిట రూ.27లక్షల సైబర్ మోసం
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:45 AM
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.
హైదరాబాద్ సిటీ: షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్(Madhapur)లో ఉంటున్న బాధితుడు సోషల్ మీడియాలో టాటా క్యాపిటల్ లిమిటెడ్, ఫైయర్స్ బ్రోకింగ్ లిమిటెడ్ పేర్లతో ఇచ్చిన ప్రకటనలు చూశాడు. అందులోని నంబర్లలో సంప్రదించగా తక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసి, ఒకటి నుంచి మూడు రోజులలో ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు పొందే అవకాశం ఉందని నమ్మబలికారు.
తమకు సెబీ అనుమతులు ఉన్నాయని నకిలీ సర్టిఫికెట్లు చూపించారు. దీంతో పలు దఫాలుగా షేర్లను కొన్నాడు. ఆ షేర్లను విక్రయించామని యాప్‌లో చూపిస్తున్నా, డబ్బులు ఖాతాలో జమ కాలేదు. వారిని సంప్రదించగా వివిధ కారణాలు చెప్పి ఆలస్యం చేస్తున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తం రూ.27లక్షల వరకు నష్టం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో కేసులో రూ.13.19 లక్షలు..
నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ వెబ్‌సైట్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి కొండాపూర్‌కు చెందిన వ్యక్తిని మోసగించారు. ట్రేడింగ్ వ్యవస్థలో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతున్నట్లు వర్చువల్‌గా చూపించడంతో నిజమని నమ్మి సుమారు రూ.13.19లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. లాభాలు అధిక మొత్తంలో కనిపిస్తున్నా డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే కాలేదు. అనంతరం ఆ వెబ్‌సైట్ నకిలీదని, తనను మోసం చేశారని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!
Read Latest Telangana News and National News